25ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ హీరోయిన్‌తో అఖిల్ సినిమా.. ఇక సక్సెస్ వచ్చినట్లే
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఫాలో అయ్యే సెంటిమెంట్స్ అన్ని ఇన్ని కావు. కానీ సెంటిమెంట్స్ కూడా అన్నిసార్లు వర్కవుట్ కావు. ఇక ఎందుకో గాని అక్కినేని అఖిల్ అనుకోకుండా ఒక సెంటిమెంటును ఫాలో అవ్వాల్సి వస్తోంది. ఏడాది వయసులోనే సిసింద్రీగా వెండితెరపై కనిపించిన అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.
1995లో వచ్చిన సిసింద్రీ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు చిన్న పిల్లలను కూడా అమితంగా ఆకట్టుకుంది. అయితే అఖిల్ యుక్త వయసులోకి వచ్చిన తరువాత హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. వరుసగా మూడు సినిమాలలో ఒక్కటి కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ లో సిసింద్రీ సెంటిమెంటును ఫాలో అవుతున్నారట.

సిసింద్రీ సినిమాలో అఖిల్ కి తల్లిగా అలనాటి అందాల హీరోయిన్ అమని నటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమని మళ్ళీ 25ఏళ్ల తరువాత అఖిల్ కి తల్లిగా మరోసారి కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఏ సినిమా అనే విషయాన్ని ఆమె బయటకు చెప్పలేదు. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను సంక్రాంతి రిలీక్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే.
మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే నాగ్ ఆధ్వర్యంలో మరో రెండు కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి ఆమని ఏ సినిమాలో అఖిల్ కి తల్లిగా కనిపిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











