twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Actor Ali: కమెడియన్ అలీకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పజెప్పిన సీఎం

    |

    సినీ నటుడు, కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. కమెడియన్ గా, నటుడిగా, హీరోగా తనదై నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్న కమెడియన్ అలీ బుల్లితెరపై 'అలీతో సరదాగా' టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వైఎస్సార్ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా ఉన్నారు. అయితే తాజాగా అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. ఏపీ సర్కారుకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించారు. ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే..

    ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం..

    ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం..

    వైఎస్సార్ పార్టీ నేత, సినీ నటుడు, కమెడిన్ అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. అయితే ఈ పదవిలో కమెడియన్ అలీ రెండేళ్లు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక అలీకి చెల్లించి జీతభత్యాల గురించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. అలీనీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంతో ఆయన టీవీ ఛానెళ్లలో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పలువురు సలహాదారులకు కేబినేట్ ర్యాంక్ ప్రకటించారు కానీ, అలీకి మాత్రం అలాంటి ర్యాంక్ గురించి ఎక్కడా ప్రకటించలేదు.

    మైనార్టీ కోటాలో రాజ్యసభకు..

    మైనార్టీ కోటాలో రాజ్యసభకు..

    అయితే చాలా కాలంగా అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని అప్పజెప్పనుందని ప్రచారమైతే సాగింది. కాగా 2019లో ఎన్నికల సమయంలో అలీ వైఎస్సార్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లోనే అలీకి సీటు ఇస్తారని అంతా భావించారు. కానీ అందులో ఆయన పోటి చేయలేదు. అనంతరం సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్సార్ సర్కారులో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఇక కొద్దిరోజుల క్రితం అలీ తన భార్యతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కలిశారు. ఆ సమయంలో అలీ త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పినట్లు సమాచారం. అప్పుడు రాజ్యసభ, ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరుగుతున్నందున అలీని మైనార్టీ కోటాలో రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని పలు విశ్లేషణలు వినిపించాయు.

     జనసేన పార్టీలో అలీ చేరతారని..

    జనసేన పార్టీలో అలీ చేరతారని..

    కానీ, జగన్ తో అలీ మీటింగ్ అయినప్పుడు తను ఎలాంటి పదవి కోరలేదని, ఏ బాధ్యత ఇచ్చినా సిద్దమేనని తెలిపారు. వీటన్నిటి తర్వాత ఇప్పుడు అలీకి సర్కారులో ఎలక్ట్రానిక్ సలహాదారుగా పదవి అప్పగించారు. అయితే అప్పట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో అలీ చేరతారనే వార్తలు కూడా వినిపించాయి. సినీ ఇండస్ట్రీలో అలీకి పవన్ కల్యాణ్ కు ఎంత సన్నిహిత్యం ఉందో తెలిసిందే. కానీ, అలీ రాజకీయంగా మాత్రం జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు పేరు ఖరారు అయింది.

    English summary
    Andhra Pradesh CM Jagan Mohan Reddy Appointed Actor Ali As AP Government Electronic Media Advisor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X