For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా నిర్ణయాలు ఎప్పుడు తప్పు కాలేదు.. ప్రభాస్, సోనుసూద్, సమంత అంటూ ఆలీ ఎమోషనల్

  |

  టాలీవుడ్‌లో కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆలీ గత నాలుగు దశాబ్దాలకుపైగా దూసుకెళ్తున్నారు. ఉత్తమ అభిరుచితో మంచి చిత్రాల్లో నటించడమే కాకుండా ఫీల్‌గుడ్ చిత్రాలకు చేయూతనిస్తున్నారు. సమాజానికి మేలు కలిగే చిత్రాలను ఎంపిక చేసుకొంటూ నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నటునిగా ఆలీ దాదాపు 1100 పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా నటుడు ఆలీ సమర్పణలో ఆలీ, నరేష్ కలిసి నటించిన చిత్రం అందరూ బావుండాలి అందులో నేనుండాలి ఆ సినిమా గురించిన విషయాలను వెల్లడిస్తూ...

  Sai Pallavi తో నాగచైతన్య కెమిస్ట్రీ అదుర్స్.. వెండితెర మీద ఇక సారంగ ధరియే!

  మలయాళ చిత్రం వికృతి ఆధారంగా

  మలయాళ చిత్రం వికృతి ఆధారంగా

  గతేడాది ఓటిటి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన వికృతి అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా అందరూ బావుండాలి అందులో నేనుండాలి సినిమా తెరకెక్కింది. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించాం. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది అని ఆలీ తెలిపారు.

  సమాజానికి మంచి సందేశంతోపాటు

  సమాజానికి మంచి సందేశంతోపాటు

  మెట్రోట్రైన్‌ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన కంటెంట్‌ ఓరియొంటెడ్‌ చిత్రం అందరూ బావుండాలి అందులో నేనుండాలి. సమాజానికి చక్కని సందేశంతోపాటు పూర్తిస్థాయి వినోదభరితంగా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం వస్తున్నది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది అని ఆలీ తెలిపారు.

  సూపర్ స్టార్ కృష్ణ, సోనుసూద్ సహకారంతో

  సూపర్ స్టార్ కృష్ణ, సోనుసూద్ సహకారంతో

  అందరూ బావుండాలి అందులో నేనుండాలి చిత్రానికి సెన్సార్ పూర్తైన సందర్భంగా చిత్ర నిర్మాత ఆలీ మాట్లాడుతూ.. మా సినిమా ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి చిత్రానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశామని అన్నారు.

  సెన్సార్ బోర్డు సభ్యులు అలా ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్‌ బోర్డు అధికారుల ప్రశంసలతో ఈ సినిమా విషయంలో నా నిర్ణయం కరెక్టే అనిపించింది. సూపర్‌స్టార్‌ కృష్ణగారు, ప్రభాస్, సోనూసుద్, సమంత మా సినిమా ప్రమోషన్‌లో పాలు పంచుకుని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా ధన్యవాదాలు అని అన్నారు.

  త్వరలోనే రిలీజ్ డేట్

  త్వరలోనే రిలీజ్ డేట్

  అందరూ బావుండాలి అందులో నేనుండాలి సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో త్వరలోనే విడుదల చేయిస్తాం. అక్కడే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటిస్తాం అని అలీ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన మోహన్‌ కొణతాల మాట్లాడుతూ- ఆలీగారు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. ఎన్నోసార్లు నేను మీతో సినిమా చేస్తాను అన్నయ్య అనేవాణ్ని. ఆలీగారు నేను చెప్పినప్పుడు సినిమా చేద్దువుగాని అని ఇన్నిరోజులు వెయిట్‌ చేయించారు. ఆలీ చాలాకాలం ఎందుకు ఆగమన్నారో సినిమా చూసిన తర్వాత నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంత గొప్ప సినిమా తీసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా అని అన్నారు.

  Ali Reza, Sayali Bhagat Interview Part 3 | Wild Dog
   నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు: ఆలీ, నరేష్, పవిత్ర లోకేశ్, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, మనో, గౌతంరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ప్రణవి మానుకొండ , సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, ముక్తార్‌ ఖాన్, భద్రం, లాస్య, సనా, వివేక్, శివారెడ్డి, సింగర్‌ మధు, గీతాసింగ్‌ తదితరులు
  దర్శకుడు: రాకేశ్‌ పళిదం
  నిర్మాతలు: అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌
  చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌: ఇర్ఫాన్
  కో డైరెక్టర్‌: ప్రణవానంద్‌
  కెమెరా: ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి
  ఆర్ట్‌: కేవీ రమణ
  డాన్స్‌ డైరెక్టర్‌: స్వర్ణ
  ఎడిటర్‌: సెల్వకుమార్
  ఫైట్స్‌: నందు
  మేకప్‌: నంద్యాల గంగాధర్
  ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సయ్యద్‌ తాజ్‌ బాషా
  విఎఫ్‌ఎక్స్‌- మాయాబజార్‌ స్టూడియో
  బ్యానర్: ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

  English summary
  Actor Ali's latest movie is andaru bagundali andulo nenundali. This film gets clearance from censor board. This occassion, Ali gets emotional about Prabhas, Samantha Akkineni help for Andaru Bagundali Andulo Nenundali movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X