ఆమె దయనీయ స్థితి చూసి అలీ కేసు వెనక్కి....
హైదరాబాద్: సినీ నటుడు అలీ ఓ కేసు విషయంలో పెద్ద మనసు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ రెండో మెగా లోక్ అదాలత్ లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పలు కేసులు పరిష్కరించే కార్యక్రమం జరిగింది. ఇందులో అలీ వేసిన కేసు కూడా ఉంది.
తనను డబ్బుల విషయంలో 50 లక్షల మేర మోసం చేసిన....వ్యక్తిపై గతంలో అలీ కేసు వేసారు. అయితే సదరు వ్యక్తి చనిపోవడంతో రెండో ముద్దాయిగా ఉన్న అతని భార్యపై కేసు నడుస్తోంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె దయనీయ స్థితిలో ఉండటంతో ఆ కేసును వెనక్కి తీసుకున్నారు అలీ.

కేసు ఎంత కాలం నడిచినా ఆమె డబ్బు చెల్లించే పరిస్థితి లేదు. పైగా ఆమె నుండి డబ్బులు రాబట్టడానికి ఎలాంటి ఆధారం లేదు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న అలీ లోక్ అదాలత్ లో భాగంగా కేసును వెనక్కి తీసుకున్నారు. తనకు చెడు చేసినా వారిపై కూడా అలీ పెద్ద మనసు ప్రదర్శించడంపై హర్షం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications