టీవీ గేమ్ షోలో కంటతడి పెట్టుకున్న అల్లు అర్జున్
ఎప్పుడూ 'హ్యీపి' హ్యీపీగా కనపడే బన్ని (అల్లు అర్జున్) ఓ టెలివిజన్ షోలో కన్నీటిని రాల్చారు. ప్రతి మంగళవారం ఈటీవీలో ప్రసారం అవుతున్న "అభిమాని" అనే గేమ్‌షోలో ఓ మారుమూల గ్రామానికి చెందిన రాకేష్ అనే అభిమాని అల్లు అర్జున్‌పై చూపిన ప్రేమకు బన్ని కంటతడి పెట్టుకున్నారు. రాకేష్‌కు చిన్నతనంలోనే పోలియో రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చచ్చుబడిపోయింది అతని కాళ్లు మాత్రమే కానీ ఆత్మ విశ్వాసం కాదు. అల్లు అర్జున్‌ని ఆదర్శంగా తీసుకొని రాకేష్ చాలా 'హ్యాపీ'గా కాలం గడుపుతున్నాడు. బన్నిలా డ్యాన్స్ చేయడమంటే రాకేష్‌కు భలే సరదా.
అబిమాని గేమ్‌షో ద్వారా అల్లు అర్జున్‌ని కలుసుకున్న రాకేష్ ఆనందోత్సాహాలలో మునిగితేలాడు. రాకేష్‌ను అల్లు అర్జున్ రెండు చేతులతో పైకెత్తుకొని స్టెప్పులేశారు. రాకేష్ పరిస్థితిని, తనపై అతను చూపిస్తున్న అభిమానానికి ఉబికి వస్తున్న కన్నీటి ఆపుకోలేక అల్లు అర్జున్ ఏడ్చేశారు. అంతేకాదు ఈ గేమ్‌కు షోకు హోస్ట్‌గా వ్యవరిస్తున్న రాజీవ్ కనకాల, అలాగే షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు సైతం ఈ దృశ్యం కనువిప్పు కలిగించింది. ఈ షోలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ రామ్ చరణ్ తేజ్ గురించి అల్లు అర్జున్ వద్ద ప్రస్తావించినప్పుడు కూడా బన్ని కళ్లలో నీళ్లు తిరిగాయి. తనకు చరణ్ అంటే చాలా ఇష్టమని బన్ని చెప్పారు.


Click it and Unblock the Notifications











