twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనిషివా? పశువువా?.. భాషను హద్దులో పెట్టుకో.. రూటు మార్చిన నాగబాబు

    |

    మెగా బ్రదర్ నాగబాబు 'మన ఛానల్ మన ఇస్టం' యూటూబ్ ఛానెల్‌లో స్పందించారు. అయితే ఈ సారి ఎవరినో టార్గెట్ చేయకుండా చాలా సౌమ్యంగా భాష దాని ప్రముఖ్యత, దాని ప్రభావం గురించి చాలా విషయాలు చెప్పారు. మనుషులు వాడే భాష వల్లే అనేక అనర్థాలు వస్తున్నాయని, అవే అనేక వివాదాలకు కారణమవుతాయని నాగబాబు చెప్పారు. తాజాగా హీరో బాలకృష్ణకు తనకు మధ్య జరిగిన మాటల యుద్దం నేపథ్యంలో భాష గురించి చెప్పడం చాలా ఆసక్తిని రేపింది. భాషను హద్దులేకుండా మాట్లాడటం వల్ల మనస్పర్ధలు పెరిగిపోతున్నాయని నాగబాబు చెబుతూ..

    ప్రపంచంలో 98 శాతం మేర భాష చెత్తే

    ప్రపంచంలో 98 శాతం మేర భాష చెత్తే

    ప్రపంచవ్యాప్తంగా 2 శాతం భాషకే అర్ధం ఉంది. మిగితా 98 శాతం మేర మనుషులు మాట్లాడే మాటలు పనికిరానిదే. దాని వల్లనే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కొన్నిసార్లు మాట్లాడటం కంటే సైగలు, ఎమోషన్స్ పలికిస్తే అంత తీవ్రత ఉండదు. అలాగే కొన్నిసార్లు మాటల కంటే సైగలు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి అనే విషయం ఓ ప్రముఖుడు చెప్పిన విషయాలు నాకు ఎంతో నేర్పాయి అని నాగబాబు చెప్పారు.

    మనషులు ఉపయోగించే భాషతోనే సమస్యలు

    మనషులు ఉపయోగించే భాషతోనే సమస్యలు

    ప్రపంచంలోని చాలా గొడవలకు భాషే కారణం. కొన్నిసార్లు పీక కోస్తాం. తల నరకేస్తాం అంటూ చెప్పేమాటలు చాలా ప్రభావితం చూపుతాయి. అదే మాటలు సైగల రూపంలో చెబితే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. భాష వల్లే మనషుల మధ్య సమస్యలు సృష్టిస్తాయనే విషయం కొత్తగా చెప్పాల్సిన మాట కాకపోయినా.. అవసరం వచ్చిందనే ఫీలివుతున్నాను కాబట్టి చెబతున్నాను అని నాగబాబు అన్నారు.

    జాగ్రత్తగా భాషను మాట్లాడాలి

    జాగ్రత్తగా భాషను మాట్లాడాలి


    అందుకే భాషను చాలా జాగ్రత్తగా వాడాలని నేను అందరికీ చెప్పాలనుకొంటున్నాను. సినిమాల్లో ఒక్కసారి చెబితే 100 సార్లు చెబితే.. భలే చెప్పారనే ఫీలింగ్ కలిగింది. అలాగే మొక్కే కాదా అనే పీకితే పీక కోస్తా అనే డైలాగ్స్‌కు ప్రేక్షకులను ఒక ఫీలింగ్‌కు గురిచేస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి డైలాగ్స్ చెబితే చాలా గొడవలు అయిపోతాయి.

    అందు కోసమే భాష పుట్టింది

    అందు కోసమే భాష పుట్టింది

    చేతలు, సైగలతో చెప్పేలేని అర్ధాన్ని, భావాన్ని చెప్పడానికే భాష పుట్టింది. తంతానురో జాగ్రత్త అని చెప్పడానికి తన్నడానికి చాలా తేడా ఉంది. దేశాల మధ్య, మతాలకు మతాల మధ్య గొడవలు రావడానికి కారణం భాషనే. ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా.. నాశనం అవ్వాలన్నా భాషనే ప్రధానం అని నాగబాబు పేర్కొన్నారు. భాషను సరైన రీతిలో వాడితే ఎలాంటి సమస్యలు ఉండవు అని నాగబాబు భాషను ఎలా మాట్లాడాలో ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

    కొన్నిసార్లు వ్యక్తులు ఆవేశంలో

    కొన్నిసార్లు వ్యక్తులు ఆవేశంలో


    కొన్నిసార్లు వ్యక్తులు ఆవేశంలో ఉపయోగించే భాష సమస్యలను సృష్టిస్తుంది. మనిషివా? పశువువా అనే మాటలు కొన్నిసార్లు చాలా గొడవలకు కారణమవుతాయి. కొన్నిసార్లు ఇద్దరి మధ్య హాస్యానికి కారణమవుతాయి. భాష అనేది పరిస్థితులు, వ్యక్తుల మూడ్‌ను బట్టి ఉంటాయి. అందుకే భాష అత్యంత ప్రమాదకరం. అందుకే భాషను చాలా జాగ్రత్తగా వాడాలనే విషయాన్ని సూచిస్తున్నాను అని నాగబాబు తెలిపారు.

    Recommended Video

    Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
    భావ వ్యక్తీకరణకు, భావోద్వేగానికి

    భావ వ్యక్తీకరణకు, భావోద్వేగానికి

    భాషను, ఎమోషన్‌ను జోడించి వాడాలి. అప్పుడే ఇద్దరి మధ్య గొడవలకు బదులు మంచి బంధం ఏర్పడుతుంది. భాష అనేది అందరి మనోభావాలను దెబ్బతీస్తుంది. కాబట్టి భాషను వాడేటప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఉపయోగించాలి. భావవ్యక్తీకరణకు, భావోద్వేగాన్ని పండించడానికి భాష ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అని నాగబాబు అన్నారు. ఇది నాకు చెప్పాలనిపించింది. అనుసరిస్తే అనుసరించండి లేకపోతే దానిని వదిలేయండి అంటూ ఆయన సూచించారు.

    English summary
    Actor and Host Nagababu gives lecture about importance of Language. He gives details and importance language which creates issues, contraversies and wars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X