బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ రియల్ హీరోగా వార్తల్లో కెక్కారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న 'స్లమ్‌డాగ్ మిలియనీర్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు అందిన పారితోషికాన్ని ఆయన 'ప్లాన్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. పిల్లల పుట్టుకను రిజిస్టర్ చేయడం, పిల్లలపై వేధింపులను నిరోధించడం, పసిపిల్లల అమ్మకాన్ని నివారించడం, నిర్బంధ విద్య, పునరావాసం వంటి కార్యక్రమాలను ప్లాన్ ఇండియా నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థతో తనకు పదేళ్ల నుంచి అనుబంధముందని అనిల్ పేర్కొన్నారు. ఇక దర్శకుడు డానీ బోలి ఈ చిత్రంలో నటించిన ముగ్గురు బాల నటులకు ఇవ్వవలిసిన పారితోషికాని కొంత తన సొంత డబ్బు కలిపి ఫిక్సెడ్ డిపాజిట్ పధ్దతిలో వేసి వారు పదహారేళ్ళు వయస్సు వచ్చాక తీసుకునేలా చేసారు. అలాగే ఆ పిల్లలని రోజూ స్కూల్ కి తీసుకెళ్ళటానికి ఆ ప్రొడక్షన్ కంపెనీ వారు ఓ ఆటో రిక్షాను మాట్లాడారు. ఆ కాంట్రాక్ట్ ఆ పిల్లలకు పదహారేళ్ళు వచ్చేవరకూ ఉంటుంది. అలా ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ కూడా అదే రూటులోకి వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారు.