బైక్ యాక్సిడెంట్: యాక్టర్ అనిల్ కుమార్ మృతి

అనిల్ కుమార్ పలు కన్నడ చిత్రాలతో పాటు, టీవీ సీరియల్స్‌లో నటించాడు. అయితే యాక్టింగ్ కెరీర్ అంతగా కలిసి రాక పోవడంతో తన తండ్రి నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకోవడం ప్రారంభించారు. బెంగుళూరులోని బిఇఎల్ లేఔట్లో అనిల్ కుమార్ నివాసం ఉంటున్నారు.
అనిల్ కుమార్‌కు బైకులంటే మహా క్రేజీ. ఆ ఇష్టంతోనే రూ. 28 లక్షలు ఖరీదైన బిఎండబ్ల్యు బైకును మార్చి నెలలో కొనుగోలు చేసారు. ప్రమాదం జరిగిన సమయంలో బైకు 100 కిలోమీటర్ల వేగంతో వెలుతోందని, ఈ క్రమంలోనే బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
2007లో విడుదలైన 'శివాని' అనే కన్నడ చిత్రంలో అనిల్ కుమార్ హీరోగా నటించాడు. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఆ తర్వాత అనిల్ కుమార్ టీవీ కార్యక్రమాలవైపు రూటు మార్చాడు. అయితే అక్కడ కూడా కెరీర్ ఆశాజనకంగా లేక పోవడంతో తన తండ్రి బలరామ్‌తో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications