ఆ విషయంలో బాలకృష్ణ అంటే అంజలికి భయమా? బోయపాటి హామీతో.. నయన్, శ్రీయా కూడా

ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్వకత్వంలో వచ్చిన రూలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం మిగల్చడంతో ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాపైనే ప్రధానంగా దృష్టిని పెట్టారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం ముగ్గురు హాట్ హీరోయిన్లను రంగలోకి దించారు. అయితే హీరోయిన్ల ఎంపికపై మీడియాలో వచ్చిన వార్త ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే...

Recommended Video

Nandamuri Mokshagna Tollywood Entry Soon | Filmibeat Telugu
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్

నందమూరి బాలకృష్ణ కోసం బోయపాటి శ్రీను రూపొందించే కథలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆయన చిత్రంలోని హీరోయిన్ పాత్రలకు కూడా చాలా బలంగా ఉంటాయనే గత చిత్రాలు నిరూపించాయి. తాజాగా గ్లామర్‌తో కూడిన మూడు పవర్‌ఫుల్ పాత్రల కోసం శ్రీయ సరన్, నయనతార, అంజలిని రంగంలోకి దించారు. గతంలో ఈ ముగ్గురు బాలయ్యబాబుతో నటించిన వారే.

 అంజలితో మరోసారి

అంజలితో మరోసారి

అయితే తాజాగా బాలకృష్ణ పక్కన ఓ పాత్ర కోసం అంజలిని సంప్రదించగా.. ముందుగా ఆమె ఈ చిత్రంలో నటించడానికి జంకిందట. బాలయ్య పక్కన పాటల్లో స్టెప్పులు వేయాలంటే తనతో కాదని.. ఆయన స్పీడ్‌ను భరించలేననే విషయాన్ని స్పష్టం చేసిందట. అయితే ఆ పాత్రలో ఎమోషనల్, ఇంటెన్సిటీని అంజలికి దర్శకుడు బోయపాటి సర్ధిచెప్పడంతో ఓకే చెప్పిందట. అంజలి ఎంపిక విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కెమిస్ట్రీ మళ్లీ రిపీట్

కెమిస్ట్రీ మళ్లీ రిపీట్

గతంలో 2016లో రిలీజైన డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణతో కలిసి అంజలి నటించి మెప్పించారు. ఆ సినిమాలో అంజలి, బాలకృష్ణ కాంబినేషన్, కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. అయితే ఆ సందర్భంలో బాలయ్యతో స్టెప్పులు వేయాలంటే మరీ కష్టమని, ఆయన స్పీడ్‌ను తట్టుకోలేనని పలువురు హీరోయిన్లు చెప్పడం తెలిసిందే. ఐదు పదులు వయసు దాటినా.. బాలయ్య డ్యాన్స్ స్పీడ్‌లో ఏ మాత్రం పస తగ్గలేదనేది తెలిసిందే.

నయన, శ్రీయ రంగంలోకి

నయన, శ్రీయ రంగంలోకి

కాగా, మరోసారి బాలయ్యతో క్రేజీ కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. సింహా చిత్రంలో నయనతారతో కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేసింది. ఇక శ్రీయా సరన్‌తో బాలయ్య ఇప్పటికే మూడు చిత్రాలకుపైగా నటించారు. గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్‌ తర్వాత తాజాగా మళ్లీ బోయపాటితో కాంబినేషన్ రిపీట్ అవుతున్నాయి. మళ్లీ సింహా లాంటి విజయం అందుకొనే ప్రయత్నాలను ఈ కాంబినేషన్ చేస్తున్నది.

మార్చిలో మొదలై దసరాకు

మార్చిలో మొదలై దసరాకు

నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రస్తుతం నటీనటులు ఎంపిక కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాంకేతిక నిపుణుల వివరాలను పూర్తిగా త్వరలోనే వెల్లడించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. అయితే దసరాకు బాలయ్యను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గతేడాదే ఓకే.. కానీ

గతేడాదే ఓకే.. కానీ

వాస్తవానికి నందమూరి బాలకృష్ణ గతేడాదే బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. కథలో కొన్ని మార్పులు చేయమని బాలకృష్ణ సూచించడంతో ఆ మేరకు బోయపాటి స్క్రిప్టులో మార్పులు చేసి సిద్దంగా ఉంచారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందని ఫిలింనగర్‌ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X