సునీల్ సాల్మన్‌కే ఎక్కువ అంజలి ఫోన్లు
అలాగే ...అంజలి బుధవారం బెంగళూరులో 'బోల్ బచ్చన్' రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటారని సినీ వర్గాలు భావించాయి. అయితే అంజలి తమ సినిమా షూటింగ్‌కి రాలేదనీ, ఫోన్‌కీ అందుబాటులో లేరని చిత్ర నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ 'ఈనాడు'కి తెలిపారు. ''కుటుంబపరమైన సమస్యలేవైనా ఉంటే పరిష్కరించుకోవాలి. వాటి మూలంగా చిత్రీకరణకు వెళ్లకపోతే నిర్మాతలు నష్టపోతారు. ఈ విషయంలో ఏదైనా సహాయం అవసరమైతే ఆమెకి అందిస్తాం'' అని నిర్మాతలు డి.సురేష్‌బాబు, సురేష్ కొండేటి పేర్కొన్నారు.
మరో ప్రక్క నటి అంజలిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆమె పిన్ని భారతిదేవి చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎగ్మూరులోని కమిషనర్ జార్జ్‌ను కలసి ఫిర్యాదుపత్రాన్ని అందజేశారు. తన అక్క కుమార్తె అంజలిని దత్తతకు తీసుకుని పెంచుతున్నానని, రవితేజ హీరోగా నటిస్తున్న 'బలుపు' చిత్ర షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిందని, అయితే ఎనిమిదోతేదీ ఉదయం నుంచి కనిపించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












