twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ కపూర్‌పై దాడి.. సినిమా సెట్లోనే ఘటన.. దాడి చేసింది ఎవరంటే..

    By Rajababu
    |

    Recommended Video

    సినిమా సెట్లోనే హీరో పై దాడి.. చేసింది ఎవరంటే..?

    బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌పై దాడి జరిగింది. సందీప్ ఔర్ పింకీ పరార్ అనే సినిమా షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అర్జున్ కపూర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..

    అర్జున్ కపూర్ చేతిని మెలిపెట్టి దాడి

    అర్జున్ కపూర్ చేతిని మెలిపెట్టి దాడి

    డిసెంబర్ 4న (సోమవారం) ఉదయం ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్జున్ కపూర్ వద్దకు వచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చేయి చాపగానే చేతిని మెలిపెట్టాడు. ఆ తర్వాత ఆయనపై దాడి చేశాడు. ఆ సమయంలో పిథోర్‌గఢ్ అనే ప్రాంతంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ వద్ద ఉన్నాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని కమల్ కుమార్ అని, అతడు ఓ డ్రైవర్ అని గుర్తించారు.

     మద్యం మత్తులో దాడి

    మద్యం మత్తులో దాడి

    అర్జున్ కపూర్‌పై దాడికి పాల్పడిన కమల్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును పోలీసుల స్వాధీనం చేసుకొన్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రూ.500 జరిమానా విధించారు.

     కేసు నమోదు.. జరిమానా

    కేసు నమోదు.. జరిమానా

    తప్పతాగి అర్జున్ కపూర్‌పై దాడి చేసిన డ్రైవర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ట్రాన్స్‌పోర్టు విభాగానికి సూచించారు. త్వరలోనే నిందితుడి లైసెన్స్‌ను స్వాధీనం చేసుకొని జప్తు చేస్తామని ట్రాన్స్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

    పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్

    పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్

    సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రంలో అర్జున్ కపూర్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. చాలా కఠినమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ చిత్రంలో హై ప్రొఫైల్ నేరస్థుల భరతం పట్టే పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన పరిణితి చోప్రా నటిస్తున్నది.

    English summary
    Arjun Kapoor who is currently shooting in Uttarakhand for his film, Sandeep aur Pinky Faraar was allegedly assaulted by a drunk man on sets. The man, who is a driver by profession, has been arrested. The police also seized Kamal Kumar's car under the Motor Vehicle Act and slapped a fine of Rs 500 for driving under the influence of alcohol.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X