లేటు వయసులో పెళ్లి చేసుకొన్న ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ళ వయసులో ఎవరితో వివాహం అంటే?
పోకిరి సినిమాలో ఇలియానాని వేధించే పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఆశిష్ విద్యార్ధి అందరికి గుర్తుండే ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో పవర్ఫుల్ విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆశిష్ మంచి గుర్తింపు అందుకున్నాడు. తాజాగా ఈయన సుహాస్ హిట్ మూవీ రైటర్ పద్మభూషణ్ సినిమాలో నటించారు. సీనియర్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆశిష్ విద్యార్ధికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సుమారు 11 ఇండియన్ భాషలలో అతను విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఇప్పటికి అడపాదడపా సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేస్తునారు. విలనిజంలో వేరియేషన్స్ చూపిస్తూ ఎలాంటి క్యారెక్టర్ అయిన సునాయాసంగా చేసేసే అతి కొద్ది మంది నటులలో ఆశిష్ విద్యార్ధి కూడా ఒకరు. ప్రస్తుతం విలన్స్ అంటే యంగ్ గా, కండలు తిరిగిన దేహంతో ఉండాలనే విధంగా చూస్తున్నారు. కాని ఆశిష్ విద్యార్ధి మాత్రం తన పెర్ఫార్మెన్స్ తోనే విలనిజం పండించేవాడు.

పాపే నా ప్రాణం సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా ఆయన అడుగు పెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఆశిష్ విద్యార్ధి అంటే నటనలో ప్రత్యేక శైలి ఉంటుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సినిమాలు తగ్గించేసిన అతను యుట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్లోగ్స్ చేస్తూ దేశం మొత్తం తిరిగేస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి యుట్యూబ్ ఛానల్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. 60 ఏళ్ళ వయస్సులో తన ప్రియురాలు రుపాలీ బరోవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె అస్సాంకి చెందిన మహిళ. తాజాగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల మధ్యలో ఆశిష్ విద్యార్ధి, రుపాలి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
20 ఏళ్ళ క్రితమే ఆశిష్ విద్యార్ధికి బెంగాల్ నటి రాజోషీతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్నేళ్ళ క్రితం అభిప్రాయ బేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తరువాత నుంచి యుట్యూబ్ వ్లోగ్స్ చేసుకుంటూ వస్తున్నారు. గత కొంతకాలంలో రుపాలీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











