పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆసిన్..

By Rajababu

సినీ నటి ఆసిన్ తొట్టుంకాల్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. తమకు ఓ ఆడ కూతురు జన్మించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది జనవరి 19న మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను ఆసిన్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలోకి ప్రవేశించిన ముద్దుల చిన్నారికి ఘనమైన ఆహ్వానం పలికామని ఆసిన్ దంపతులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌, ఆసిన్ దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు.

 మా జీవితంలోకి చిన్నారి దేవత

మా జీవితంలోకి చిన్నారి దేవత

మంగళవారం మా జీవితంలోకి చిన్నారి దేవత వచ్చింది. గడిచిన తొమ్మిది నెలలు చాలా ఎక్సైటింగ్‌గా, స్పెషల్‌గా గడిచాయి. ఈ సంతోష సమయంలో మా వెంట నడిచిన సన్నిహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్క్షతలు. మా జీవితం ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు అని ఆసిన్ దంపతులు ప్రకటనలో వెల్లడించారు. నా కూతురు నాకు లభించిన జన్మదిన కానుక అని ఆసిన్ తెలిపింది.

Recommended Video

The Film Makers Have Edited Out The Lavanya Tripati's Bikini Scene
 ఢిల్లీలో ఆసిన్, రాహుల్ పెళ్లి

ఢిల్లీలో ఆసిన్, రాహుల్ పెళ్లి

గతేడాది ఆసిన్, రాహుల్ పెళ్లి ఢిల్లీలో జరిగింది. తొలుత క్రిస్టియన్ వివాహ పద్దతిలో, ఆ తర్వాత హిందూ మత సంప్రదాయలకు అనుగుణంగా పెళ్లి జరిగింది. ఆసిన్‌ను రాహుల్ శర్మ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

 అక్షయ్ కుమార్‌ది కీలకపాత్ర

అక్షయ్ కుమార్‌ది కీలకపాత్ర

ఆసిన్‌, రాహుల్ ప్రేమలో, పెళ్లిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాత్ర కీలకమైనది. రాహుల్‌కు ఆసిన్‌ను అక్షయ్ కుమార్ పరిచయం చేయడం గమనార్హం. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు వెళ్లింది.

 సినీ పరిశ్రమకు ఆసిన్ గుడ్‌బై

సినీ పరిశ్రమకు ఆసిన్ గుడ్‌బై

పెళ్లి తర్వాత సినీ పరిశ్రమకు ఆసిన్ దూరమైంది. ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నది. చివరిసారిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఆసిన్ ఆల్ ఈజ్ వెల్ అనే చిత్రంలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X