»   »  టాలీవుడ్లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి

టాలీవుడ్లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ సోదరుడు భరత్ రాజు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మరువక ముందు తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన హీరో హీరో కరంసింగ్‌ అలియాస్ అస్లాం (21) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు.

వరంగల్ శివనగర్‌ ప్రాంతానికి చెందిన అస్లాం నిరుపేద కుటుంబం నుండి సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. మృతుని తల్లి ఫాతిమా గృహిణి కాగా తండ్రి రూపేష్‌ ఆటో డ్రైవర్‌. తెలుగులో పలు సినిమాలలో నటించాడు.

 Actor Aslam dies in road accident

ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటూ వర్దమాన హీరోగా రాణిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదం రూపంలో అతడిని మృత్యువు కబలించడం అందరినీ కలిచి వేసింది.

అస్లాం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా బీబీనగర్‌ వద్ద డివైడర్‌కు ఢీకొని మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అస్లాం నటించిన ప్రేమాయణం అనే సినిమా వచ్చేనెలలో విడుదల కావాల్సి ఉంది.

English summary
Telugu film actor Karamsingh(Aslam) was killed in a road accident when his bike Crashed on the road at Bibinagar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu