జీరో డెడికేషన్, అతడి కథ ముగిసినట్లే... స్టార్ హీరోలపై నోరు పారేసుకున్న పృథ్విరాజ్!

Recommended Video

Actor Babloo Prithiveeraj Sensational Comments On Suriya And Ajith || Filmibeat Telugu

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించిన నటుడు పృథ్వీరాజ్ తాజాగా తమిళ స్టార్స్ అజిత్, సూర్య మీద నోరు పారేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు హీరోలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అభిమానులకు కోపం తెప్పించింది.

పృథ్విరాజ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ ఇటీవల యూట్యూబ్‌లో మళ్లీ వైరల్ అయింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ అజిత్, సూర్య గురించి గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాలని యాంకర్ కోరగా పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు.

అజిత్ జీరో డెడికేషన్

అజిత్ జీరో డెడికేషన్

అజిత్ గురించి పృథ్విరాజ్ మాట్లాడుతూ... అతడు డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసలు గుప్పించారు. చాలా కూల్ పర్సన్ అని పొగిడారు. అయితే అతడిలో డెడికేషన్ జీరో, నటించాలనే ఆసక్తి అస్సలు ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి ఇంత స్టార్ డమ్ రావడం అదృష్టమే అంటూ వ్యాఖ్యానించారు.

నటించడం కంటే వంట చేయడంపై ఎక్కువ ఆసక్తి

నటించడం కంటే వంట చేయడంపై ఎక్కువ ఆసక్తి

దర్శకుడు షాట్ కోసం పిలిచినపుడు కానీ, లేదా తన పెర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించినపుడు కానీ అజిత్ పెద్దగా ఎగ్జైట్ అవ్వడని పృథ్వీరాజ్ తెలిపారు. అజిత్‌కు నటన కంటే వంటలు వండటం, ఇతర పనులు చేయడంపైనే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. కానీ నేను అలా కాదు.. షాట్ కోసం నాకు పిలుపు రాగానే ఎనర్జీ వచ్చేస్తుంది, అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంటుందని పేర్కొన్నాడు.

సూర్య హారబుల్ పర్సన్... అతడి పీరియడ్ ముగిసినట్లే

సూర్య హారబుల్ పర్సన్... అతడి పీరియడ్ ముగిసినట్లే

మరో స్టార్ సూర్య గురించి సైతం పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సూర్య చాలా హారబుల్ పర్సన్... సెల్ప్-సెంట్రెడ్. అతడి పిరియడ్ దాదాపుగా ముగిసినట్లే అంటూ వ్యాఖ్యానించారు. పృథ్విరాజ్ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఇటు అజిత్ అభిమానులు, అటు సూర్య అభిమానులు... సోషల్ మీడియాలో పృథ్విరాజ్ మీద ఓ రేంజిలో విరుచుకపడుతున్నారు. సూర్య, అజిత్ ఇద్దరూ కూడా హంబుల్ నేచర్ ఉన్న పర్సన్స్. అలాంటి వారిపై ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయడానికి నోరెలా వచ్చింది అంటూ మండి పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X