ఈ మొక్కని వేసింది మీరే సర్.. చుట్టాలకు కూడా తెలియదు.. కోడి రామకృష్ణ గురించి బాబు మోహన్!

కోడి రామకృష్ణ టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరు. 100కు పైగా చిత్రాలకు ఆయన దర్శత్వం వహించారు. శుక్రవారం రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో భాదపడుతున్న కోడి రామకృష్ణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోడి రామకృష్ణకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని, మధుర జ్ఞాపకాలని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ నటుడు బాబు మోహన్ కోడి రామకృష్ణ మృత దేహానికి నివాళులు అర్పించి కన్నీటిపర్యంతం అయ్యారు.

 ఈ మొక్కని నాటింది మీరే సర్

ఈ మొక్కని నాటింది మీరే సర్

కోడి రామకృష్ణ మృత దేహానికి నివాళులు అర్పించిన తర్వాత బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెడుతూనే నటుడిగా నాకు జన్మనిచ్చిన తండ్రి కోడి రామకృష్ణగారు అని బాబు మోహన్ అన్నారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణతో ఎప్పుడూ అంటుండేవాడిని.. ఈ మొక్కని నాటింది మీరే సర్ అని.

 ఆహుతి చిత్రంతో

ఆహుతి చిత్రంతో

ఆహుతి చిత్రంతో కోడి రామకృష్ణ గారు నన్ను నటుడిగా పరిచయం చేశారు. ఫస్ట్ డైలాగ్ చెప్పగానే మెచ్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ప్రతి డైలాగ్ ని మొదట ఆయన చెప్పి ఆ తర్వాత ఆమెతో చెప్పించేవారు అని బాబు మోహన్ అన్నారు. ఆయన ప్రతి చిత్రంలో నాకు అద్భుతమైన పాత్రలు ఇస్తూ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగేలా చేశారు. ఆయన సినిమాల్లో రాత్రియంబవళ్ళు పనిచేసినా అలసట ఉండేది కాదు అని బాబు మోహన్ తెలిపారు.

మా చుట్టాలకు కూడా

మా చుట్టాలకు కూడా

సినిమాల్లోకి రాకముందు నేనెవరో మా చుట్టాలకు కూడా సరిగా తెలిసేది కాదు. అలాంటి నను తీసుకుని వచ్చి దేశ దేశాల్లో తెలిసే బాబు మోహన్ ని చేశారు అని అన్నారు. అలాంటి ఖ్యాతిని నాకందించిన గురువువారు మరణించారంటే భరించలేకున్నా. మా అమ్మా నాన్న తర్వాత ఆయనే నాకు దైవం అని బాబు మోహన్ ఎమోషనల్ గా తెలిపారు. గురువుగారు అని పిలిస్తే.. అలా పిలవద్దు. మనం స్నేహితులం అని అనేవారు.

కొన్ని కథలు సిద్ధం చేశా

కొన్ని కథలు సిద్ధం చేశా

ఆ మధ్యన నాతో మాట్లాడుతూ.. కొన్ని కథలు రెడీ చేశా.. చంపేద్దాం రెడీగా ఉండు అని అన్నారు. ఆ చిత్రాల కోసం సిద్ధం అవుతున్న సమయంలో గురువుగారు మరణించారు. అయినా ఇది సృష్టి ధర్మం. గురువుగారు మనల్ని విడిచి వెళ్ళలేదు. భగవంతుడిని కలసి తిరిగి వస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా అని బాబు మోహన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X