twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రత్యేక హోదాపై మాట్లాడి.... బాలకృష్ణ ఇలా దొరికిపోయాడేంటి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఓ రాజకీయనాయకుడుగా మీడియాను ఎదుర్కోవటంలో బాలకృష్ణ ఇంకా రాటు తేలాల్సి ఉంది . ఆయన రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్..సచివాలయానికి వచ్చినప్పుడు ...ఎపి ప్రత్యేక హోదాపై మాట్లాడారు. అయితే మొదట ఆయన...ఈ ప్రత్యేక హోదాను డిసైడ్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. దాంతో అంతా బాలకృష్ణ ఇలా మాట్లాడటం తో ఆశ్చర్యపోయారు.

    ప్రత్యేక హోదాపై అంతటా చర్చ జరుగుతున్న ఈ సమయంలో బాలకృష్ణ...కేంద్రంది భాధ్యత లేదా కేంద్రాన్ని అడుగుతాం అనకుండా ముఖ్యమంత్రి చేతిలో ఉంది అనటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ డైలీ ....ఈ వార్తను ప్రత్యేకంగా ప్రచురించింది.

    హిందూపూర్ శాశన సభ్యుడైన ఆయన ఇలా తనలోని తెలియనితనాన్ని ప్రదర్శించారంది. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం అయినప్పుడు ముఖ్యమంత్రి దే భాధ్యత అని మాట్లాడటమేంటి అన్నారు. వెంటనే అక్కడ మీడియావారు ఈ విషయమై బాలయ్యను కౌంటర్ చేస్తే....ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని, స్పెషల్ స్టేటస్ కావాలా..వద్దా అనే విషయమై అన్నారని ప్రస్దావించింది.

    Actor Balakrishna on Spl Status issue

    అయితే కాస్సేపటికి ఆయన మరో సారి ...ఇదే విషయమై మాట్లాడుతూ...ఈ సారి తన తప్పుని సవరించుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాయితీలు, నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు బాలకృష్ణ. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బాలకృష్ణ స్పందిస్తూ.. ఇలా మాట్లాడారు.

    తిరుగులేని హీరోగా అటు సినిమాల్లోనూ, హిందూపురం శాసనసభ్యుడు గా ఇటు రాజకీయాల్లోనూ పూర్తి స్ధాయి బిజీగా ఉంటున్నారు బాలకృష్ణ. రాజకీయ జీవితంలో భాగంగా బాలకృష్ణ సోమవారం ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి వచ్చారు. తన నియోజకవర్గంలోని ఆసుపత్రుల అభివృద్ధికి నిధుల విడుదల, నూతన రాజధానిలో బసవతారకం మెమోరియల్‌ ఆసుపత్రి స్థాపన విషయమై ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఆయన చర్చించారు.అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బాలకృష్ణ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అందుబాటులో ఉండేలా బసవతారకం మెమోరియల్‌ ఆసుపత్రిని నూతన రాజధానిలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకు 36 ఎకరాల భూమి అవసరమవుతుందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.20 కోట్లు విడుదల చేయాల్సిందిగా కూడా కోరామన్నారు.

    Actor Balakrishna on Spl Status issue

    సినిమాల విషయానకి వస్తే...

    ఇది నందమూరి నామ సంవత్సరం' అంటూ ఎన్టీఆర్‌ ప్రకటించేశారు. కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌'తో తన దూకుడు చూపించాడు. ఆ తరవాత ఎన్టీఆర్‌ 'టెంపర్‌'తో ఆ జోరు పెంచాడు. ఇక బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ వంతు. ఆయన 'లయన్‌'గా రాబోతున్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'లెజెండ్‌'తో తన ఖాతాలో ఓ ఘన విజయం వేసుకొన్నారు బాలయ్య.

    అదే ఉత్సాహంతో 'లయన్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పాటలూ, ప్రచార చిత్రాల్లో బాలయ్య పలికిన సంభాషణలు అభిమానులకు కావల్సినంత కిక్‌ ఇస్తున్నాయి. ''ఇలాంటి డైలాగులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి'' అంటూ బాలకృష్ణ వూరిస్తున్నారు. మరి మరోసారి 'సింహా' శబ్దం బాలయ్యకు విజయాన్ని తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.

    English summary
    Hindupur TDP MLA Nandamuri Balakrishna on Monday exposed his ignorance on Special Status issue when the actor-turned-politician said that it was the Chief Minister who will decide on the status for Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X