twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎంలతో పెద్దల భేటీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్‌లో బయటపడ్డ విభేదాలు

    |

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమలో పనిచేసే రోజువారీ వేతన జీవులు, థియేటర్లలో పనిచేసే కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఇక సినీ నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని సినీ పెద్దలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నపాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినీ పెద్దలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

    తెలుగు రాష్ట్రాల సీఎంలతో

    తెలుగు రాష్ట్రాల సీఎంలతో

    కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున తదితర హీరోలు, దిల్ రాజు, సీ కల్యాణ్ లాంటి నిర్మాతలు సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌ను కలిశారు. లాక్‌డౌన్ విధించడంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రులకు విన్నవించారు. అంతేకాకుండా సినిమా షూటింగులకు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కోరడం తెలిసిందే.

    నాకు సమాచారం లేదు..

    నాకు సమాచారం లేదు..

    ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టాలీవుడ్ పెద్దలపై సినీ హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం నాకు తెలియదు. తనకు అలాంటి విషయాలపై సమాచారం లేదు అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రధాన్యం సంతరించుకొన్నాయి.

     జూన్ రెండో వారంలో

    జూన్ రెండో వారంలో

    సినిమా షూటింగులు ప్రారంభించే అంశంపై ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల గురించి వ్యక్తిగతంగా తనకు సమాచారం లేదని, మీడియాలో వస్తున్న వార్తల వల్లే తెలిసిందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. షూటింగులు జూన్‌ రెండోవారంలో ప్రారంభం కావొచ్చని అనుకొంటున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగులు జరుపుకొనేలా ప్రత్యేకంగా ప్రభుత్వాలు జీవో జారీ చేయాలని బాలయ్య సూచించారు.

    ప్రాధాన్యతను బట్టి అనుమతులు

    ప్రాధాన్యతను బట్టి అనుమతులు

    లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రాధాన్యతను బట్టి షూటింగులకు అనుమతి ఇవ్వాలని.. సినిమాలు ప్రారంభమై.. ఎక్కువ శాతం పూర్తి చేసుకొన్న చిత్రాలకు షూటింగులు జరుపుకొనేలా అనుమతి ఇవ్వాలి. అలాగే పూర్తయిన సినిమాలను ప్రదర్శించుకొనేలా వెసలుబాటు కలిగించాలి. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

    Recommended Video

    Senior Telugu Actress Sanghavi With Her First Baby, Picture Goes Viral
    కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా

    కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా

    షూటింగులకు అనుమతిస్తే సామాజిక దూరం పాటించాలి. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలి అని బాలకృష్ణ సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసం ఉత్తమ విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీరంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుంది.

    English summary
    Actor Balakrishna Sensational comments on Film makers over meeting with Telangana CM KCR, AP CM YS Jagan Mohan Reddy. He said that, He was not aware of CMs meeting information.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X