రాజమౌళికి ఫోన్ చేసినా లాభం లేదు.. నటుడి సంచలన వ్యాఖ్యలు..!
Recommended Video

రాజమౌళి అంతర్జాతీయంగా కూడా సంచలన దర్శకుడిగా మారిపోయారు. టాలీవుడ్ బడ్జెట్ ప్రమాణాలు మారిపోయాయి అంటే అంది రాజమౌళి చలవే. బాహుబలి చిత్రం అంతలా ప్రాభవం చూపింది. బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ లెక్కలన్నీ మార్చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు భాను చందర్ రాజమౌళితో ఉన్న అనుబంధాన్ని గుర్తుంచేసుకున్నారు. రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సింహాద్రి చిత్రంలో
రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ చిత్రం సింహాద్రిలో బాను చందర్ కీలకమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ద్వారా భానుచందర్, రాజమౌళి మధ్య అనుభందం ఏర్పడింది.

ఆనాడే చెప్పాను
సింహాద్రి చిత్రం డబ్బింగ్ పూర్తయ్యాక రాజమౌళిని రమ్మని అడిగానని భాను చందర్ అన్నారు. ఏంటి సార్ పిలిచారట అని రాజమౌళి అడిగారు. మీరు సెన్సేషనల్ దర్శకులు అవుతారు అని చెప్పానని భానుచందర్ అన్నారు.

బాహుబలిని ఎవరైనా ఊహించారా
రాజమౌళి ఒకప్పుడు శాంతినివాసం సీరియల్ దర్శకుడిగా చాలా చిన్న పొజిషన్ లో ఉన్నారు. అలాంటి రాజమౌళి బాహుబలి తీస్తాడని ఎవరైనా ఊహించారా అని అన్నారు.

అందుకే వెనుకాడను
తాను చిన్న దర్శకులతో సైతం సినిమాలు చేయడానికి వెనుకాడనని దానికి కారణం రాజమౌళే అని అన్నారు. చిన్న దర్శకులని ప్రోత్సాహిస్తే భవిష్యత్తులో అద్భుతాలు చేస్తారని అన్నారు.

రాజమౌళి ఫోన్ కి కూడా దొరకరు
సింహాద్రి సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అని రాజమౌళికి అప్పుడే చెప్పా. భవిష్యత్తులో మీరు సంచలన దర్శకుడిగా మారుతారు. ఆ రోజు నేను మీకు ఫోన్ చేస్తా. కానీ మీరు నాఫోన్ కి కూడా దొరకరు అంటూ రాజమౌళితో చెప్పానని భానుచందర్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











