Brahmaji: పెళ్లై కొడుకున్న మహిళతో బ్రహ్మాజీ లవ్.. చేయి కోసుకుని, చైన్ తాకట్టు పెట్టి!
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. చిన్నా, పెద్ద అనే ఏ తేడా లేకుండా సుమారు అందరూ అగ్ర హీరోలతోపాటు యువ కథానాయకులతో కలిసి నటించాడు.
అప్పుడప్పుడు టీవీ షోలలో, పలు కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచులతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్న బ్రహ్మాజీ, ఆతని భార్య శాశ్వతి కలిసి ఓ పోగ్రామ్ లో సందడి చేశారు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విరూపాక్ష సినిమాతో: కమెడియన్ గా, నటుడిగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బ్రహ్మాజీ. 1986 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ అలరించిన బ్రహ్మాజీ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గం, 18 పేజీస్, విరూపాక్ష వంటి సినిమాలతో అలరించారు.

ప్రోమో వైరల్: తాజాగా బ్రహ్మాజీ ఆయన భార్య శాశ్వతి ఇద్దరూ కలిసి కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న అలా మొదలైంది పోగ్రామ్ కి హాజరయ్యారు. ఈ పోగ్రామ్ లో తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

3 రోజులు అన్నం తినలేం: ఈ ప్రోమోలో శాశ్వతికి బ్రహ్మాజీ ఎలా ప్రపోజ్ చేశాడో చెప్పుకొచ్చాడు. "ఒకవైపు మూన్ లైట్. మరోవైపు సన్ రైజ్. హై స్పీడ్ లో శాశ్వతి దగ్గరికి వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్ డేకు చైన్ కూడా తాకట్టు పెట్టాను. ఎక్కువగా తనతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాన్ని. నా సగం జీవితం పబ్లిగ్ బూత్ లోనే గడిచిపోయింది. తను తిట్టిందంటే మూడు రోజులు అన్నం తినలేం" అని బ్రహ్మాజీ తెలిపాడు.
కొడుకు ఉన్న మహిళతో: ఇక శాశ్వతి మాట్లాడుతూ "మా పెళ్లిలో కన్యదానం చేసింది డైరెక్టర్ కృష్ణవంశీ గారు. ఒకసారి బ్రహ్మాజీ చేయి కోసుకోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. చాలా ఇన్నోవేటిగ్ గా ఉంటాడు" అని తెలిపారు. ఇదిలా ఉంటే బ్రహ్మాజీ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన జీవితంలో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. అదివరకే పెళ్లై కొడుకు ఉన్న బెంగాలీ అయిన శాశ్వతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు నటుడు బ్రహ్మాజీ.

పిల్లలు వద్దనుకుని: విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడు అడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకుని తన కుమారుడిగా భావించి గొప్ప మనసు చాటుకున్నాడు. అంతేకాకుండా తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థ పూరిత ఆలోచనలు వస్తాయోనని అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు బ్రహ్మాజీ. ఆమె కొడుకు ఓ పిట్ట కథ మూవీతో హీరోగా పరిచయం అయిన సంజయ్ రావు. అదే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి తన కొడుకుతో స్క్రీన్ షేర్ కూడా చేసుకున్నాడు బ్రహ్మాజీ.


Click it and Unblock the Notifications











