For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత-నాగ చైతన్య విడాకులు, రూ. 250 కోట్ల భరణంపై బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్​..

  |

  టాలీవుడ్​ యంగ్​ హీరో నాగ చైతన్య, స్టార్​ హీరోయిన్​ సమంత విడాకుల విషయం ఇప్పటికీ.. అప్పుడో, ఇప్పుడో, ఎక్కడో ఓ చోట ప్రస్తావనకు వస్తూనే ఉంది. చై-సామ్​ విడిపోతున్నట్లు అక్టోబర్​ 2, 2021 ప్రకటించడంతో యావత్​ తెలుగు సినీ లోకం నివ్వెరపోయింది. ఎందుకు ఇలా జరిగింది? కారణాలేంటి? అనేవి ఇప్పటికీ హాట్​ టాపిక్​గానే ఉన్నాయి. వారి అనౌన్స్​మెంట్​ తర్వాత ఎన్నో విషయాలు చక్కర్లు కొట్టాయి. సామ్​పై విమర్శలు అధికంగా వచ్చాయి. వాటికి ధీటుగా సమంత స్పందించడం కూడా జరిగింది. ప్రస్తుతం చై-సామ్​ వారు మూవ్​ ఆన్​ అయి ఎవరి కెరీర్​పై వారు ఫోకస్​ పెడుతున్నారు. అయితే వారి విడాకులు, తదితర విషయాలపై ఎప్పుడూ.. ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా నాగ చైతన్య-సమంత విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి తదితర విషయాలపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ స్పందించాడు.

  చిన్నా, పెద్ద తేడా లేకుండా..

  చిన్నా, పెద్ద తేడా లేకుండా..

  సీనియర్​ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్​గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. చిన్నా, పెద్ద అనే ఏ తేడా లేకుండా సుమారు అందరూ అగ్ర హీరోలతోపాటు యువ కథానాయకులతో కలిసి నటించాడు. అప్పుడప్పుడు టీవీ షోలలో, పలు కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచులతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాడు.

   సమంత రూ. 250 కోట్ల భరణం..

  సమంత రూ. 250 కోట్ల భరణం..

  ప్రస్తుతం సినిమాల్లో సహాయ నటుడు, నెగెటివ్​ రోల్స్​ వంటి విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో సక్సెస్​ఫుల్​ నటుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య, సమంత డివోర్స్​, రూ. 250 కోట్ల భరణం వంటి తదితర విషయాలపై ఆసక్తికర విషయాలు తెలిపాడు.

   నేను ఎవరి విషయాల్లోకి దూరను..

  నేను ఎవరి విషయాల్లోకి దూరను..

  నేను ఫ్రెండ్లీ పర్సనే. అలా అని నాకు కోపం రాదని కాదు. అప్పుడప్పుడు వస్తుంది. అలాగే నేను ఎవరి విషయాల్లోకి దూరను. కానీ మాట్లాడాల్సిన సందర్భం వస్తే మాత్రం కచ్చితంగా నోరు విప్పుతాను. ఎలా అంటే, సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె గురించి.. ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.

   నువ్వో సెకండ్​ హ్యాండ్​..

  నువ్వో సెకండ్​ హ్యాండ్​..


  'నాగచైతన్య దగ్గరి నుంచి సమంత రూ. 250 కోట్లు భరణంగా తీసుకుని గేమ్​ ప్లే చేశావు. నువ్వో సెకండ్ హ్యాండ్'​ అంటూ చాలా చీప్​గా మాట్లాడాడు. అప్పుడు ఆ కామెంట్​కు సమంత గట్టిగానే రిప్లై ఇచ్చింది. అది వేరే విషయం. కానీ అతడి మాటలకు నాకు కోపమొచ్చి నేను స్పందించాను.

   నీకు పదేళ్లు పడుతుంది..

  నీకు పదేళ్లు పడుతుంది..

  'నీకు సిగ్గు, శరం లేదు. నువ్వో థర్డ్​ గ్రేడ్​ పర్సన్​. అమ్మాయి వ్యక్తిగత విషయంతో నీకేంటి సంబంధం?. సమంత ముఖం కనీసం చూడాలన్నా, ఆమెతో మాట్లాడలన్నా.. నీకు సమారు పదేళ్లు పడుతుంది. అలాంటిది, సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోషపడు.

   సమంత ఫ్రెండ్స్​ కూడా రియాక్ట్​ కాలేదు..

  సమంత ఫ్రెండ్స్​ కూడా రియాక్ట్​ కాలేదు..


  సరదాగా ఒక అమ్మాయిని పొగుడు. యాక్టింగ్​ నచ్చకపోతే చెప్పు. అంతేకానీ ఆమె వ్యక్తిగత విషయం గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు? అని అన్నాను. అతని కామెంట్​కు సమంత స్నేహితులు కూడా రియాక్ట్ కాలేదు. కానీ, నేను స్పందించాను. ​ఆ దెబ్బతో అతడు మళ్లీ అలాంటి కామెంట్ చేయలేదు' అని తెలిపాడు నటుడు బ్రహ్మాజీ.

  English summary
  Naga Chaitanya And Samantha Announced They Would Like To Split Up. A Netizens Criticise Samantha And Said She Took Rs 250 Cr As Alimony. In Recent Interview Actor Brahmaji Said He Reacted On That Netizens Comments. And Told He Has Gave Warning To Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X