Brahmaji: బాలయ్య డైరెక్టర్ మెడపై కత్తి పెట్టి బెదిరించిన నటుడు బ్రహ్మాజీ.. వీడియో వైరల్

సీనియర్​ టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్​గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. చిన్నా, పెద్ద అనే ఏ తేడా లేకుండా సుమారు అందరూ అగ్ర హీరోలతోపాటు యువ హీరోలతో కలిసి నటించాడు.

అప్పుడప్పుడు టీవీ షోలలో, పలు కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచులతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్న బ్రహ్మాజీ తాజాగా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ మెడపై కత్తి పెట్టి మరి బెదిరించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Actor Brahmaji Forced Anil Ravipudi For Promoting Slumdog Husband Movie

సపోర్టింగ్ రోల్స్: కమెడియన్ గా, నటుడిగా తనకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బ్రహ్మాజీ. 1986 సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ అలరించిన బ్రహ్మాజీ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

Actor Brahmaji Forced Anil Ravipudi For Promoting Slumdog Husband Movie

పిట్ట కథలు మూవీ: ఇటీవల మాచర్ల నియోజకవర్గం, 18 పేజీస్, విరూపాక్ష వంటి సినిమాలతో అలరించారు. ఇక బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు గురించి సుమారుగా అందరికీ తెలిసే ఉంటుంది. పిట్ట కథలు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు సంజయ్ రావు. ఈ సినిమా తర్వాత సంజయ్ రావు మరే సినిమా చేయలేదు.

Actor Brahmaji Forced Anil Ravipudi For Promoting Slumdog Husband Movie

నటీనటులు: ఇప్పుడు సంజయ్ రావు హీరోగా వస్తున్న చిత్రం 'స్లమ్ డాగ్ హస్బండ్' (Slumdog Husband). కుక్కతో పెళ్లి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా, సంజయ్ రావుకు జోడీగా ప్రణవి మానుకొండ చేస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను మైక్ మూవీ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.

Actor Brahmaji Forced Anil Ravipudi For Promoting Slumdog Husband Movie

వీడియో వైరల్: 'స్లమ్ డాగ్ హస్బండ్' సినిమాలో బ్రహ్మాజీతోపాటు అలీ, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకున్న ఈ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించడమే కాకుండా విభిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బ్రహ్మాజీ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

ఎన్నిసార్లు వస్తావ్: భగవంత్ కేసరి సినిమా చిత్రీకరణలో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రెడీ అంటూ శ్రీలీలకు చెప్పారు. అప్పుడే వచ్చిన బ్రహ్మాజీ 'అన్న ఒక్క వీడియో పెట్టవా ప్లీజ్' అని అనిల్ రావిపూడిని అడుగుతాడు. 'దేనికి' అని డైరెక్టర్ అంటే.. 'మా అబ్బాయి సినిమా రిలీజ్ ఉంది' అని బ్రహ్మాజీ అంటాడు. 'ఊకో అన్నా.. ఎన్నిసార్లు వస్తావ్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నావ్, సాంగ్ అన్నావ్.. వస్తనే ఉంటావా. నేనేనా ఇంకా' అని అనిల్ రావిపూడి చిరాకుగా అంటారు.

థ్యాంక్స్ అన్నా: అనిల్ రావిపూడి అన్నదానికి 'చెప్పవా' అని సీరియస్ గా బ్రహ్మాజీ అంటే.. 'ఈ ఒక్కసారికి వదిలేయ్. చాలా టైడ్ గా ఉంది' అని డైరెక్టర్ సమాధానం ఇచ్చారు. దీంతో అనిల్ రావిపూడి మెడపై కత్తి పెట్టి మరి 'జూలై 29న స్లమ్ డాగ్ హస్బండ్ సినిమా రిలీజ్. తప్పక చూడండి' అని చెప్పమని చెప్పించారు. తర్వాత థ్యాంక్స్ అన్నా బ్రహ్మాజీ చెప్పి వెళ్లిపోయారు. ఎంతో కామెడీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X