నటుడు బ్రహ్మాజీ కొడుకు వివాహం (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు నటుడు బ్రహ్మాజీ చూడ్డానికి ఎంత యంగ్‌గా ఉంటారు. ఆయనకు పెళ్లీడు కొడుకు ఉన్నాడంటే నమ్మడం కాస్త కష్టమే. ఆయన తనయుడి పేరు సంజయ్. సంజయ్ వివాహం ఇటీవల బెంగాళీ అమ్మాయితో కోల్‌కతాలో జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇంద్రాక్షిని పెళ్లాడారు.
వీరి వివాహం బెంగాళీ సాంప్రదాయంలో జరిగిందని ఫోటోలు చూస్తే స్పష్టం అవుతోంది. సంజయ్ మెరైన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. సజంయ్-ఇంద్రాక్షి పెళ్లి ముందు నుండే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసి తన సినీ పరిశ్రమలోని మిత్రులకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట బ్రహ్మాజీ.
స్లైడ్ షోలో సంజయ్-ఇంద్రాక్షి పెళ్లి ఫోటోలు చూద్దాం....

కొడుకు, కోడలుతో బ్రహ్మాజీ
తనయుడు సంజయ్, కోడలు ఇంద్రాక్షితో కలిసి నటుడు బ్రహ్మాజీ

బెంగాళీ సాంప్రదాయంలో...
పెళ్లి కూతురు బెంగాళీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, వివాహం కోల్‌కతాలో జరుగడంతో వీరి వివాహం అక్కడి సాంప్రదాయం ప్రకారం జరిగినట్లు ఈ ఫోటోల చూస్తే స్పష్టమవుతోంది.

బ్రహ్మాజీ గురించి
బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగరీత్వా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు.

సినిమాల్లోకి ఇలా...
చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు. మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఏ.ఎం.ఐ.ఈ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.


Click it and Unblock the Notifications











