శ్రీ బూతు పురాణమే .. వాంతులొస్తున్నాయి : ఏపీ రాజకీయాలపై బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్

చిత్రసీమ తల్లివంటిది.. నమ్ముకున్న వారిని కళామ్మతల్లి ఎప్పటికైనా న్యాయం చేస్తుందని పెద్దలు చెబుతూ వుంటారు. కొందరి విషయంలో ఈ మాట నిజమేనని అనిపిస్తూ వుంటుంది. అలాంటి వారిలో బ్రహ్మాజీ ఒకరు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతోమంది ఫేడ్ అవుట్ అయిపోగా.. బ్రహ్మాజీ మాత్రం ఈ వయసులోనూ చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అన్ని తరహా పాత్రల్లోనూ మెప్పించిన అరుదైన నటుడు బ్రహ్మాజీ. తన కంటే వయసులో పెద్దవారితోనైనా, చిన్నవారితోనైనా ఈజీగా కలిసిపోగల తత్త్వం, కష్టపడే లక్షణమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది.

బ్రహ్మాజీని చిత్రసీమలో ముద్దుగా ఆల్‌రౌండర్ అని పిలుస్తూ ఉంటారు. నటనే కాదు.. ముక్కుసూటితనం ఆయన నైజం. సినిమాలతో పాటు రాజకీయాలు ఇతర సమకాలీన అంశాలపైనా బ్రహ్మాజీ స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ వుండే ఆయన సరదాగా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మాజీ చెప్పే విధానం అందరికీ నచ్చడంతో ఆయనకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. పలుమార్లు అవి విమర్శలకు, వివాదాలకు దారితీసినా ఎప్పుడూ తగ్గింది లేదు. ఎందుకంటే అక్కడుంది బ్రహ్మాజీ కాబట్టి.

actor brahmaji sensational tweet on andhra pradesh politics

ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బ్రహ్మాజీ రెండే ముక్కల్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెత్తగా వున్నాయని.. అవి చూస్తే వాంతులు వచ్చేలా అసహ్యంగా వున్నాయి.. శ్రీబూతుపురాణం అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రసీమలోని కొందరు ఎన్నికల్లో ఎవరో ఒకరికి మద్ధతుగా నిలబడితే.. బ్రహ్మాజీ మాత్రం ఇలా స్పందించడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇప్పుడే కాదు.. బ్రహ్మాజీ తీరు ఎప్పుడూ విభిన్నమే. స్టార్ యాంకర్ అనసూయ - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు లైగర్ సినిమా సమయంలో జరిగిన వివాదం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనసూయ ట్వీట్‌‌కు కౌంటర్ విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. అనసూయను ''ఆంటీ.. ఆంటీ '' అని పిలవడంతో పాటు రకరకాల మీమ్స్‌తో హోరెత్తించారు. దీనికి అనసూయ అంతే ఘాటుగా బదులిచ్చారు. తనని ట్రోల్ చేసిన వారిపై కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు.

actor brahmaji sensational tweet on andhra pradesh politics

ఈ గొడవలోకి బ్రహ్మాజీ వచ్చారు. ఆ సమయంలో '' వాట్ హ్యాపెనింగ్ '' అంటూ ఆయన ఓ ట్వీట్ వదిలారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ' ఏం లేదు అంకుల్ ' అని కామెంట్ పెట్టారు. దీనికి ఆ వెంటనే బ్రహ్మాజీ స్పందించారు. ''అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా '' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా అనసూయ వివాదం తాలూకు కౌంటర్‌గానే బ్రహ్మాజీ ఇచ్చారంటూ నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ పోయారు.

అంతేకాదు.. అప్పట్లో హైదరాబాద్ వర్షాలు, వరదల గురించి కూడా బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్ వివాదాస్పదమైంది. భారీ వర్షాల కారణంగా తన నివాసం మునిగిపోవడంతో ఆ విషయాన్ని సెటైరికల్‌గా చెప్పారు. వరదల కారణంగా మునిగిపోయిన తన ఇంటి ఫోటోలను షేర్ చేస్తూ.. తాను ఓ బోట్ కొనాలి అనుకుంటున్నా, ఏ బోట్ అయితే బెటర్ కొంచెం చెప్పండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో బ్రహ్మాజీ డిలీట్ చేశారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆయన ట్విట్టర్‌కు దూరంగా వున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X