అతడి సినిమాలు మనకు అవసరం లేదు: భరత్ సక్సెస్ మీట్లో బ్రహ్మాజీ కామెంట్
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరరెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం భారీ విజయం సాధించడం, రెండు రోజుల్లోనే 100 కోట్లకుపైగా వసూలు చేయడంతో చిత్ర బృందం సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ తన ప్రసంగంతో అలరించారు. చివర్లో తనదైన శైలిలో నవ్వించారు.
Recommended Video


నటుడిగా తృప్తి ఇచ్చిన సినిమా
ఒక మంచి సినిమా, మనసుకు నచ్చిన సినిమా ఆడితే తృప్తిగా ఉంటుంది. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి, అందులో నటిస్తూ ఉంటాం. ఒక నిజాయితీ, కంటెంటు ఉన్న సినిమా సూపర్ హిట్టయితే యాక్టర్స్ కు చాలా తృప్తిగా ఉంటుంది. అలా నాకు తృప్తి ఇచ్చిన సినిమా ‘భరత్ అనే నేను' అని బ్రహ్మాజీ తెలిపారు.

మహేష్ బాబు తప్ప ఎవరినీ ఊహించుకోలేం
ఈ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఎక్కడా కామెడీ చేయద్దు, ఎక్స్ ప్రెషన్స్ కూడా వద్దని శివగారు చెప్పారు. అలాగే ఫాలో అయ్యాను, చాలా మంచి పేరు వచ్చింది. పక్కన మహేష్ బాబు లాంటి యాక్టర్ ఉంటే ఎవరైనా నేచురల్‌గా యాక్ట్ చేయాల్సిందే. నేను ఎక్స్ పీరియన్డ్స్ యాక్టర్ అయినా చాలా సీన్లు ఆయన చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఆయనలో అంత ఇంటెన్సిటీ, సిన్సియారిటీ కనిపించింది. కొన్ని సీన్లు చూస్తుంటే నటన గురించే పుట్టాడేమో అనిపిస్తుంది. ఈ సినిమా ఆయన తప్పించి వేరే ఎవరినీ ఊహించుకోలేం. అంత కమిట్మెంటుతో, అంత సిన్సియర్ గా చాలా బాగా చేశారు... అని బ్రహ్మాజీ ప్రశంసలు గుప్పించారు.

గూస్ బంప్స్....
ఈ సినిమాలో నాకు లక్కీగా రెండు వేరియేషన్లు వచ్చాయి. సాధారణంగా కమెడియన్ గా వాడుకుని వదిలేస్తారు. కానీ ప్రెస్ మీట్ ముందు నాకు వచ్చిన డైలాగ్ అదృష్టంగా భావిస్తున్నాను. పది పేజీల్లో డైలాగులు చెప్పక్కర్లేదు. రెండు మూడు లైన్లలో శివ అద్భుంగా రాశాడు. థియేటర్లలో చూసినపుడ అది ఎంత ఎమోషనల్ సీనో అర్థమైంది. ఇది గూస్ బంప్స్ మూమెంట్. థియేటర్ ఫైట్, అసెంబ్లీ సీన్, ప్రెస్ మీట్ సీన్ మహేష్ బాబు కంటే బాగా ఇంకెవరూ చేయలేరేమో.... అని బ్రహ్మాజీ తెలిపారు.

ఇక శంకర్ గారి సినిమాలు అవసరం లేదు
నేను ఎప్పుడూ తమిళంలో శంకర్ గారి సినిమాలు చూసి ఫీలయ్యేవాడిని, ఇంత మంచి డైరెక్టర్లు, మంచి సినిమాలు తెలుగులో ఉండవా? కమర్షియల్ సినిమాలకు మనకు డైరెక్టర్లు ఉన్నారు. కానీ మెసేజ్ ఓరియెంటెడ్, ఇంట్రెస్టింగ్‌గా మాస్ అప్పియరెన్స్‌తో తీసే డైరెక్టర్ సౌతిండియాలో ఓన్లీ శంకరే అని ఫీలయ్యేవాడిని, మనకు ఇక శంకర్ గారి సినిమాలు అవసరం లేదు. ఆ లోటును పూడ్చడానికి మనకు ఇపుడు శివ ఉన్నాడు. దానయ్యగారు చాలా సినిమాలు తీశారు. ఆయనకు ఇది స్పెషల్ సినిమా.... అని బ్రహ్మాజీ అన్నారు.
మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చా
నేను సూపర్ స్టార్ కృష్ణగారి అభిమానిని, ఏలూరులో అసోసియేషన్ ప్రెసిడెంటును కూడా, ఆ సమయంలో మహేష్ బాబుగారి సినిమాలో యాక్ట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ రోజు ఆయన కాంబినేషన్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాను నేను (మహేష్ బాబుతో పాటు అంతా నవ్వులు), అవ్ యూ బాబూ... థాంక్యూ వెరీ మచ్... అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











