twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధైర్యే సాహసే లక్ష్మీ.. ముందడుగు వేసిన బ్రహ్మాజీ

    |

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. సెటైర్లు, పంచ్‌లు వేస్తూ ఉంటారు. యంగ్ హీరోలు, కమెడియన్లతో బ్రహ్మాజీ వేసే కౌంటర్స్ ఒక్కోసారి ఎంతో ఫన్‌ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, సాయి ధరమ్ తేజ్, రాహుల్ రవీంద్రన్ వంటి వారంతా చేరితే ట్విట్టర్ మొత్తం దద్దరిల్లాల్సిందే. సినిమా అప్డేట్స్, సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్‌పై బ్రహ్మాజీ తన సహచర నటులతో వెబ్ సైట్లు, మీడియాపై సెటైర్లు వేస్తుంటారు.

    తాజాగా బ్రహ్మాజి ఇలాంటి ఓ గాసిప్‌పై సెటైర్ వేశాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయబోతోన్నట్టు అందులో యాభై యేళ్ల వ్యక్తిగా బ్రహ్మాజీ నటించనున్నట్టు.. అతనికి జోడీగా 25 యేళ్ల అమ్మాయి కూడా ఉంటుందని రాసుకొచ్చారు. ఇక వీటిపై నేరుగా రాహుల్ రవీంద్రన్‌నే అడిగేశాడు. రాహుల్ బ్రో.. ఎప్పుడు స్టార్ట్ చేయబోతోన్నావ్.. హీరోయిన్ ఎవరు? అంటూ సెటైర్ వేశాడు. దీనికి రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. హహ వారు ఏదైనా రాస్తారు.. కనీసం చెక్ కూడా చేయరు.. నా దగ్గరైతే స్క్రిప్ట్ లేదు. వీళ్లే అది కూడా రాసేస్తే బాగుంటుంది అని కౌంటర్ వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు.

    Actor Brahmaji Step Into Set For Movie Shoot

    టాలీవుడ్‌లో షూటింగ్‌లు ప్రారంభమైనా కూడా పెద్ద హీరోలు, నటీనటులెవ్వరూ సెట్‌కు వెళ్లడం లేదు. అయితే తాజాగా బ్రహ్మాజి మాత్రం సెట్‌లో అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సెట్‌లో వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ బ్రహ్మాజి ముందడుగు వేశాడు. సెట్‌కు తిరిగొచ్చాను.. షూటింగ్ లైఫ్ ఇలా ఉంటుందని బ్రహ్మాజీ షేర్ చేశాడు.

    English summary
    Actor Brahmaji Step Into Set For Movie Shoot.. Actor Brahmaji stepped into Movie Set After long Gap. #backonsets #shootlife ..dhairye saahasay lakahmi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X