twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ పరిస్థితిపై బ్రహ్మాజీ ట్వీట్.. ఇంత వెటకారామా? భగ్గుమంటున్న నెటిజన్లు!

    |

    ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగర జీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలకు నీళ్లు చేరడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లోని విలాసవంతమైన భవనాలు నీట మునగడం తెలిసిందే. ఇటీవల తన ఇంటిలోకి భారీగా నీరు చేరడంపై బ్రహ్మాజీ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే నెటిజన్లు ఆయన చేసిన ట్వీట్‌ను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఏమిటంటే..

    ఇది నా ఇంటి పరిస్థితి అంటూ

    ఇది నా ఇంటి పరిస్థితి అంటూ

    భారీ వర్షాలకు బ్రహ్మాజీ ఇంటిలోకి నడుము కంటే ఎక్కువ భాగం వరకు నీరు చేరింది. నాలుగు రోజులైనా వరద ప్రభావం తగ్గకపోవడం ఇంటిలోని నీరు బయటకు పోకపోవడాన్ని ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఇది నా ఇంటి పరిస్థితి. ఏదైనా బోట్ కొనాలనుకొంటున్నాను. మీకు తెలిస్తే ఏదైనా మంచి సలహా ఇవ్వండి అంటూ బ్రహ్మాజీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    బ్రహ్మాజీ వెటకారంగా ట్వీట్ చేశారంటూ...

    బ్రహ్మాజీ వెటకారంగా ట్వీట్ చేశారంటూ...

    అయితే బ్రహ్మాజీ వెటకారంగా ట్వీట్ చేశారని భావించిన నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కష్టం మీ వరకు వస్తే తప్ప మీరు స్పందించారా? ఎంతో మంది వరద ముంపుతో కనీస వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో సెలబ్రిటీలు ఇలా బాధ్యతారాహిత్యంగా స్పందించడం సరికాదు అని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.

    చెన్నైలో వరదలోస్తే ఫ్రండ్స్ వసూలు చేశారంటూ

    చెన్నైలో వరదలోస్తే ఫ్రండ్స్ వసూలు చేశారంటూ

    చెన్నై, ఇతర ప్రాంతాల్లో వరదలు వస్తే ఫండ్స్ వసూలు చేసి ఆదుకొంటారు? తెలంగాణలో ఇలాంటి ఆపద ఎదురైతే చిల్లర పోస్టు పెడుతారా? విపత్తు వచ్చినప్పుడు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి లేదా ఇతరుల మనోభావాలతో ఆడుకోవద్దు? సాధారణ జనం, పేద ప్రజలు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బాధపడుతారో.. మీకు ఇప్పుడు తెలిసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    #HyderabadRains : భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదే ఈత కొడుతున్న వైనం!! | Oneindia Telugu
    ఇలాంటి పరిస్థితుల్లో సైటైర్లా?

    ఇలాంటి పరిస్థితుల్లో సైటైర్లా?

    హైదరాబాద్ వరద పరిస్థితులు, కష్టాల నుంచి బయటపడటానికి ప్రజలు జోకులు వేసుకొంటే పర్వాలేదు. కానీ సెలబ్రిటీలు ఇలాంటి సమయంలో సెటైర్లు వేస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. చీప్‌గా, ఎబ్బెట్టుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌పై దారుణంగా నెటిజన్లు నిప్పులు గక్కుతున్నారు.

    English summary
    Brahmaji social media comments on Hyderabad floods misfired. He shared a photo of his which in full of water. He said I want buy a Motor boat, Please suggest me any good. Netizens serious reactions on Brahmaji tweet on Hyderabad floods.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X