పవర్ స్టార్ సిటీలో లేకుంటే పవర్ కట్ చేస్తారా?

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. పవర్ స్టార్ సిటీలో లేకపోతే పవర్ కట్ చేస్తారా..? అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌పై చాలా రకాలుగానే చర్చ మొదలైంది. పవర్ కట్ బాధను తట్టుకోలేకనే ట్వీట్ చేశారని తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం పవర్ స్టార్ పేరు వాడుకుని పబ్లిసిటీ సంపాదించుకోవడానికే? ఇలా ట్వీట్ చేసారని అంటున్నారు.

అయితే దీనిపై బ్రహ్మాజీ స్పందించారు. జస్ట్ ఫర్ ఫన్ కోసమే ట్వీట్ చేశాను అని బ్రహ్మజీ వివరణ ఇచ్చారు. బ్రహ్మాజీ ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. వందల మంది బ్రహ్మాజీ ట్వీట్‌కు రిట్వీట్ చేసారు. గత కొన్ని రోజులుగా పవర్ కట్‌తో చాలా ఇబ్బంది పడుతున్నామని తమ పవర్ కట్ బాధలు ఒకరితో ఒకరు పంచుకున్నారు.

Actor Brahmaji tweet on power cut

మొత్తానికి బ్రహ్మాజీ ట్వీట్ కారణంగా హైదారాబాద్‌లో పవర్ కట్ ఏ రేంజిలో ఉందో స్పష్టమవుతోంది. గత కొన్ని రోజులుగా పాలకులు లేకుండా పాలన సాగింది కాబట్టి పవర్ కట్ కష్టాలు పట్టించుకునే వారే లేరు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన నేపథ్యంలో పవర్ కట్ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫారిన్ టూర్లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా పవర్ కట్ సమస్య ఇలానే ఉంటే....ఆయన తన జనసేన పార్టీ తరుపున ప్రజల కోసం ఉద్యమించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దా..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X