twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టాలీవుడ్'పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్: అంతా వాళ్లే.., ఎదగనివ్వడం లేదు..

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వ పరంపరపై తీవ్ర విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్యే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు దీనిపై ఘాటుగా స్పందించారు. సొంత పేరు మీద వచ్చినవాడు ఒక్కడూ లేడంటూ గట్టిగానే ఉతికారేశారాయన. ఇప్పుడు మరో సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా ఆయనకు జతకలిశారు..

    ఎదగనివ్వడం లేదు:

    ఎదగనివ్వడం లేదు:

    తెలుగు ఇండస్ట్రీలో వారసత్వాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి ఎవరు అడుగుపెట్టినా.. వారిని ఎదగనివ్వడం లేదు. ఇక ఇప్పుడొస్తున్న సినిమాల్లో కథ, కథనాలు ఏమాత్రం బాగుండటం లేదు.

    వాళ్లకే ఎందుకు?:

    వాళ్లకే ఎందుకు?:

    ఇండస్ట్రీలో వర్థమాన సినీ నటులు చాలామంది ఉన్నారు. టాలెంట్‌ ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటుంది. చిత్రపరిశ్రమలో ప్రతిపక్ష నాయకుని పాత్రలకు ప్రతిభావంతమైన నటులు ఉన్నప్పటికీ పరభాషా నటులనే ఎంపికచేయడం బాధనిపిస్తోంది.

     సినిమాల్లోకి ఎందుకొచ్చానా?..:

    సినిమాల్లోకి ఎందుకొచ్చానా?..:

    ఇప్పటి వరకు నేను 800కు పైగా సినిమాల్లో చేశాను. ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. అసలెందుకు సినిమాల్లోకి వచ్చానా? అని. వ్యాపారంలో ఉండటమే బెటర్ అని భావిస్తున్నా. సినీ ఇండస్ట్రీలో కొనసాగడం వల్ల పేరే తప్ప ఇంకే ప్రయోజనం లేదు.

     సినిమాలతో ఒరిగిందేమి లేదు..:

    సినిమాలతో ఒరిగిందేమి లేదు..:

    ఇండస్ట్రీలో పేరొచ్చినంత మాత్రానా ఆర్థికంగా ఒరిగేదేమి లేదు. ఇప్పుడైతే నటనపై బోర్ కొట్టేసింది. అయితే మంచి పాత్రలు వెతుక్కుంటూ వస్తే మాత్రం కచ్చితంగా కాదనను.

     ఏపీలో కష్టం..:

    ఏపీలో కష్టం..:

    ఏపీలో సినీ ఇండస్ట్రీ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలే లేవు. అయితే విశాక జిల్లా మాత్రం లొకేషన్లకు మినహాయింపు. తెలంగాణలో స్టూడియోలు బాగున్నాయి. అలా అని విశాఖలో స్టూడియోలు పెడితే.. వాటి మనుగడ కష్టమే.

     రాజకీయాలంటే అసహ్యం..:

    రాజకీయాలంటే అసహ్యం..:

    రాజకీయాలపై నాకు విపరీతమైన అసహ్యం. నా తోటి నటీనటులు మురళీమోహన్‌, జయలలిత, జయసుధ, జయప్రద, మోహన్‌బాబు తదితరులంతా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నాకు మాత్రం రాజకీయాలంటే ఇష్టం లేదు. భవిష్యత్‌లో సైతం ఏ పార్టీకి మద్దతివ్వను. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆరోగ్య కారణాల వల్లే కొంతకాలంగా గ్యాప్ తీసుకున్నా.

     పండుగవేళ నర్సీపట్నంలో..:

    పండుగవేళ నర్సీపట్నంలో..:

    మకర సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని నర్సీపట్నంలో సోమవారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమ పోకడలపై ఆయన స్పందించారు. న్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, శివాజీగణేషన్‌, సావిత్రి, ఎస్వీ రంగారావు వంటి నటీనటులు ప్రజాదరణ పొంది వారి గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు.

    English summary
    Senior Actor Chandra Mohan critisized that Tollywood is not encouraging upcoming actors who are coming with out back ground.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X