twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కృష్ణ-విజయ నిర్మల పెళ్లికి నలుగురమే సాక్షులం, నా బ్యాచిలర్ రూములోనే కలుసుకునే వారు’

    |

    Recommended Video

    Actor Chandramohan Reveals Unknown Facts About Krishna & Vijaya Nirmala

    ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఈ సినీ ప్రముఖురాలి మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

    విజయ నిర్మల మరణంపై ప్రముఖ నటుడు, విజయ నిర్మలతో కలిసి ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్ స్పందించారు. చాలా రోజుల నుంచి విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే మేము వెళ్లి చూసి వచ్చాము. ఆమె చాలా మంచి వ్యక్తి.... మా అసోసియేషన్‌తో పాటు చాలా మందికి దానాలు, సహాయాలు చేశారని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

    ఆ బేనర్లో మేము ఇద్దరమే హీరోలం

    ఆ బేనర్లో మేము ఇద్దరమే హీరోలం

    విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్‌ బేనర్లో చేసిన సినిమాల్లో నేను కానీ, కృష్ణగారు కానీ ఎవరో ఇద్దరం మాత్రమే హీరోలుగా ఉండేవారం. కృష్ణ గారు వేరే సినిమాలతో బిజీగా ఉంటే నేను హీరోగా చేసేవాడిని. ఫస్ట్ పిక్చర్ ‘రంగుల‌రాట్నం'లో చెల్లిగా నటించింది. అప్పటి నుంచి ఆమెను ఎప్పుడు చూసినా నాకు చెల్లాయి అనే భావన కలిగేదని... చంద్రమోహన్ తెలిపారు.

    ఆమె డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ

    ఆమె డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ

    ఫిల్మ్ నగర్లో ఇద్దరం ఎదురెదురుగా ఇళ్లు కట్టుకున్నాం. తరచూ వెళ్లి కలిసేవాడిని.. నన్ను సొంత అన్నయ్యలాగా చూసుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్. ఒకే కుటుంబ సభ్యుల్లా మెలిగేవారం. ఆవిడ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ నేను ఉన్నాను. చాలా మంచి మంచి పాత్రలు వేసినట్లు వెల్లడించారు.

    వాళ్ల పెళ్లికి మేము నలుగురమే సాక్షులం

    వాళ్ల పెళ్లికి మేము నలుగురమే సాక్షులం

    విజయ నిర్మల మరణం కృష్ణకు చాలా పెద్ద షాక్. వాళ్లు పెళ్లి చేసుకున్న సమయంలో నలుగురమే సాక్షులం. కృష్ణ మేకప్ మెన్, విజయ నిర్మల అసిస్టెంట్, నేను, మోహన్ కుమార్ అనే ఒక జర్నలిస్టు... మేము మాత్రమే ఉండి తిరుపతిలో పెళ్లి చేశాం. వారికి మేమంతా చాలా ఆత్మీయులమని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

    పెళ్లికి ముందు నా బ్యాచిలర్ రూములోనే..

    పెళ్లికి ముందు నా బ్యాచిలర్ రూములోనే..

    కృష్ణ, విజయ నిర్మల ఇద్దరూ పెళ్లికి ముందు ఎప్పుడైనా కలుసుకోవాలంటే నా బ్యాచిలర్ రూమ్ ఇచ్చేవాడిని.. మేమంతా ఆంత క్లోజ్‌గా మెలిగేవారం. నేను దాదాపు 50 మంది హీరోయిన్లతో చేశాను. విజయ నిర్మలతో ఉన్న సాన్నిహిత్యం ఎవరితోనూ లేదు. ఆమె మరణం చాలా బాధాకరం. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

    విజయ నిర్మల

    విజయ నిర్మల

    హీరోయిన్‌గా 50కిపైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల.... దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

    English summary
    Actor Chandramohan Pays Condolence to Vijaya Nirmala death. Vijaya Nirmala was an Indian film actress, producer and director known for her works predominantly in Telugu cinema. She has directed 44 films in Telugu. In 2002, she entered the Guinness Book of Records as the female director of the most films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X