»   »  తెలుగు నటుడు చంద్రమౌళి మృతి

తెలుగు నటుడు చంద్రమౌళి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సీనియర్ నటుడు చంద్రమౌళి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. చంద్రమౌళి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1971లో సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రమౌళి దాదాపు 47 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్‌ కళాకారుడి రాణిస్తూ వస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గరలోని మునగలపాలెంకు చెందిన ఆయన ప్రముఖ నటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేశారు.

 Actor Chandramouli Passed Away

'అంతా మన మంచికే' అనే చిత్రంతో వెండి తెరకు పరిచయమైన చంద్రమౌళి అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి నిన్నటితరం నటులతో పాటు చిరంజీవి జనరేషన్ హీరోల సినిమాల్లో, ఆ తర్వాతి తరం హీరోల సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

English summary
Senior Actor cum dubbing artist Chandramouli passed away. Chandramouli who was suffering from age-related ailments passed away at a hospital. Chandramouli hails from Munagalapalem near Srikalahasti, Chittoor Dist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X