డబ్బిచ్చి రివ్యూస్ రాయించుకోలేదు: గరుడ వేగ సక్సెస్‌పై చరణ్ దీప్
పిఎస్‌వి గరుడవేగ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'పిఎస్‌వి గరుడు వేగ' సినిమా శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
శుక్రవారం ఉదయం ప్రేక్షకుల రెస్పాన్స్ స్వయంగా చూసేందుకు హీరో రాజశేఖర్‌తో పాటు మరికొందరు నటులు ప్రసాద్ ఐమాక్స్‌కు వచ్చారు. ఈ సంద్భంగా సినిమాలో రాజశేఖర్ తో పాటు ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటించిన చరణ్‌దీప్ మీడియాతో మాట్లాడారు.

డబ్బులతో రివ్యూస్ రాయించుకోలేదు
"మా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజల నుండి జెన్యూన్ రివ్యూస్ వస్తున్నాయి. రివ్యూలకు డబ్బులు ఇచ్చి రాయించుకోలేదు. ఇది నిజమైన సక్సెస్' అని చరణ్ దీప్ అన్నారు.

అంకుశం, మగాడు తర్వాత
"అంకుశం, మగాడు సినిమాల్లో రాజశేఖర్ గారికి ఎలాంటి మంచి పేరు వచ్చిందో... ఈ సినిమాకు కూడా అంతే పేరు వస్తుంది'' అని చరణ్ దీప్ అన్నారు.

ప్రవీణ్ సత్తారు గారికి థాంక్స్
"ఈ సినిమాలో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన ప్రవీణ్ సత్తారు గారికి థాంక్స్. ఆయన సినిమా సినిమాకు డిఫరెంట్ జోనర్ చేస్తున్నారు. ఇది టోటల్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ." అని చరణ్ దీప్ అన్నారు.

థియేటర్‌కి వెళ్లి చూడండి
"అందరూ థియేటర్‌కి వెళ్లి చూసి మా సినిమాను ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది" అని చరణ్ దీప్ అన్నారు.


Click it and Unblock the Notifications











