»   » హీరోపై దాడి చేసిన ఎస్సై, కమీషనర్‌కు ఫిర్యాదు

హీరోపై దాడి చేసిన ఎస్సై, కమీషనర్‌కు ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: తనపై అనవసరంగా దాడి చేసాడని కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ బెంగులూరు సిటీ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. ఈ నెల 24న రాత్రి 1.30 గంటలకు తన స్నేహితులతో కలిసి చర్చ్ స్ట్రీట్ లో ఉండగా కబ్బర్ పార్క్ పోలీస్ సబ్ ఇన్స్ స్పెక్టర్ నవీన్ తనపై దాడి చేసాడంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గురువారం కమీషనర్‌ ఎంఎన్ రెడ్డిని చేతన్ కుమార్ కలిసారు. ఫిర్యాదు సమయంలో అతనితో పాటు యాక్టర్, ఎంఎల్‌సి తారా కూడా ఉన్నారు. ఈ కేసు గురించి బెంగులూరు సెంట్రల్ జోన్ డిసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ చేతన్ కుమార్ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కబ్బన్ పార్క్ ఏసిపి శోభా రాణి ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారని, ఆమె ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

Actor Chetan Kumar accuses SI of assault

చేతన్ కుమార్ పై దాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎస్సై నవీన్.....కమీషనర్ ఎంఎన్ రెడ్డి పర్సనల్ స్టాఫ్ కుమారుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశం అయింది.

చేతన్ కుమార్ గురించిన వివరాల్లోకి వెళితే యూఎస్‌లో పుట్టి పెరిగిన చేతన్ కుమార్ ఇటీవల ‘ఆ దినగలు' అనే కన్నడ చిత్రం ద్వారా వెండి తెర అరంగ్రేటం చేసారు. తొలి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

English summary
Kannada actor Chetan Kumar has accused a Cubbon Park police sub-inspector of assaulting him over a trivial issue late on January 24 night when he was on Church Street with friends.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu