జైలు పాలైన హీరో కోసం...యువతి సూసైడ్ ప్రయత్నం
కన్నడ సూపర్ స్టార్ దర్శన్..భార్యను హించిన కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. తమ కాపురంలో కలతలు రావడానికి హీరోయిన్ నిఖితే కారణమని, ఆమె నా భర్తతో ఎఫైర్ పెట్టుకుందని దర్శన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఈ నేపథ్యంలో నిఖితపై కన్నడ నిర్మాతల మండలి నిషేదం విధించడం, నిషేదంపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ నిషేదాన్ని గురువారమే ఎత్తి వేశారు.
ఆ విషయం పక్కన పెడితే దర్శన్‌ను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ 16 ఏళ్ల యువ అభిమాని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆ అభిమాని పేరు దేవిక. కురుబరాహల్లిలోని జెసి నగర్ నివాసి. హీరో దర్శన్‌కు వీరాభిమాని.తన అభిమాన హీరో జైలు పాలైన విషయం తెలుసుకుని తీవ్ర మనో వేధనకు గురైన దేవి...నిద్ర మాత్రలు మిగి ఆత్మహత్యా యత్నం చేసింది.
ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం శృతి మించితే పరిస్థితి ఎలా ఉంటుందో...ఈ ఘటనే నిదర్శనం కన్నాడ జనాలు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











