twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శవంతో సెక్స్ కాన్సెప్ట్ ఎందుకు చేసామంటే...!: దేవీ శ్రీ ప్రసాద్ గురించి ధనరాజ్

    నెక్రోఫీలియా కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా అంటూ వస్తుంన్న దేవీ శ్రీ ప్రసాద్ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రలో నటించిన ధన్‌రాజ్ చిత్ర విశేషాలను తెలియజేశారు.

    |

    Recommended Video

    శవంతో సెక్స్ కాన్సెప్ట్ ఎందుకు చేసామంటే...!

    నెక్రోఫీలియా కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ఆ మధ్య బాగానే హల్చల్ చేసింది. స్వామిరారా సినిమా ఫేమ్ పూజా రామచంద్రన్.. ఈ సినిమాలో ఓ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే యాక్సిడెంట్‌లో ఆమె మరణిస్తుంది. శవాన్ని మార్చురీలో పెడితే.. శవంపై అత్యాచారానికి తెగబడతారు. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ శ్రీ కిషోర్.

     శవంపై అత్యాచారం

    శవంపై అత్యాచారం

    ఆర్వో క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్వీ రాజు నిర్మిస్తున్నాడు. మరి ఇంతకీ శవంపై అత్యాచారం చేసిందెవరు? అంటే ‘దేవిశ్రీప్రసాద్' అట. అంటే ‘దేవి, శ్రీ, ప్రసాద్' అనే ముగ్గురు స్నేహితులట. టైటిల్ రోల్స్‌లో మనోజ్ నందం, ధన్‌రాజ్ మరో కొత్త కుర్రాడు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.

    పూజా రామచంద్రన్ మెయిన్ రోల్

    పూజా రామచంద్రన్ మెయిన్ రోల్

    ఈ సందర్భంగా ప్రముఖ పాత్రలో నటించిన ధన్‌రాజ్ చిత్ర విశేషాలను తెలియజేశారు. "ఈ సినిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను, భూపాల్, మనోజ్ నందం.. ముగ్గురం ప్రధాన పాత్రల్లో నటించాం. దేవి అనే పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే, నేను శ్రీ అనే పాత్రలో కనపడతాను.

    నటించమని చెప్పేశారు

    నటించమని చెప్పేశారు

    పూజా రామచంద్రన్ కంటే ముందు దాదాపు పదమూడు మంది హీరోయిన్స్‌ను కలిసి కథ చెబితే.. వాళ్లు నటించమని చెప్పేశారు. కానీ పూజా రామచంద్రన్‌ కథ వినగానే యాక్ట్ చేయడానికి అంగీకరించింది. సినిమాలో పూజా రామచంద్రన్ పేరు లీలా రామచంద్రన్. తను ఇందులో హీరోయిన్‌గా నటించింది.

    వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని

    వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని

    సినిమా అంతా ఆరు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ మధ్య సినిమా ప్రీమియర్ చూసిన తరుణ్, ప్రిన్స్ తదితరులు సినిమాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో చేశాం. నా పాత్ర విష‌యానికి వ‌స్తే.. నాది మార్చురీ వ్యాన్ డ్రైవ‌ర్‌ పాత్ర.

    శవాన్ని రేప్ చేయడం ఏంటి?

    శవాన్ని రేప్ చేయడం ఏంటి?

    సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన వారందరూ ఇదొక వల్గర్ సినిమా, శవాన్ని రేప్ చేయడం ఏంటి? అని అన్నారు. కానీ సినిమా చూస్తే వల్గారిటీ ఎక్కడా కనపడదు. ఇది యూత్ సినిమాయే.. కానీ బూతు సినిమా కాదు. దర్శకుడు శ్రీకిషోర్ చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు.

    పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో

    పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో

    త‌ను లేకుండా ఈ సినిమాను ఊహించ‌లేం. సినిమాను 15-20 రోజుల్లో పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో తెరకెక్కించేశాడు. ఎనభై శాతం సినిమా మార్చురీ గదిలోనే షూట్ చేశారు. ముందు వేర్వేరు టైటిల్స్ అనుకున్ననప్పటికీ.. చివరకు దేవి శ్రీ ప్రసాద్ టైటిల్ అయితే బావుంటుందని దాన్నే పెట్టాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌గారి పేరు పెట్టుకున్న తర్వాత మా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగని మేమెక్కడా ఆయన పేరుని మిస్ యూజ్ చేయలేదు. "

    English summary
    Actor Dhan Raj also told that people who are criticising the movie will change their opinion once they watch the film. The film is releasing on 17th on this month along with the 7 other films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X