For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత.. శోక సంద్రంలో సినీలోకం!

  |

  దేశం గర్వించ దగిన ప్రముఖ నటుడు, బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇకలేరు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. దిలీప్ కుమార్ మరణాన్ని ఆయన స్నేహితుడు ఫైజల్ ఖాన్ ట్విట్టర్‌లో ధృవీకరించారు. దిలీప్ కుమార్ ఇకలేరనే విషయాన్ని భారమైన హృదయంతో తెలియజేయస్తున్నాం అని తెలిపారు. దిలీప్ మరణానికి సంబంధించిన మిగితా వివరాల్లోకి వెళితే..

   దిగ్గజ నటుడు కన్నుమూత

  దిగ్గజ నటుడు కన్నుమూత

  ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఒకప్పటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ బుధవారం (జూలై 7) కన్నుమూశారు. ఈ నటుడు గత కొన్ని రోజులుగా వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన కొద్ది రోజుల వ్యవధిలోనే అనేకసార్లు ఆసుపత్రిలో చేరాడు. చివరిగా ఆయన జూన్ 30 న ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేరారు.

  చివరి ట్వీట్ లో

  చివరి ట్వీట్ లో

  దిలీప్ కుమార్ భార్య సైరా భాను అతనితో పాటు ఉన్నారు. అయితే ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఆమె అభిమానులకు హామీ ఇచ్చారు. చివరిగా భాను చేసిన ట్వీట్‌లో, "దిలీప్ కుమార్ సహబ్ ఆరోగ్యం ఇంకా స్థిరంగా ఉంది, ఇంకా ఐసియులో ఉన్నాడు, మేము అతనిని ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము, కానీ అతని వైద్య పరిస్థితి తెలిసిన వైద్యుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాము, వైద్యులు అనుమతించిన వెంటనే అతన్ని ఇంటికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

   అంతకు ముందు కూడా

  అంతకు ముందు కూడా

  "ఆయన ఈ రోజు డిశ్చార్జ్ చేయబడడు, ఆయనకు అభిమానుల ప్రార్థనలు కావాలి, త్వరలోనే తిరిగి వస్తాడు." అంటూ ఆమె ట్వీట్ చేశారు. నిజానికి అంతకుముందు కూడా అంటే జూన్ 6న ఊపిరి అందక పోవడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో ఆయనకు ఫ్లూయిడ్ 350సీసీ ప్రోసిజర్ చేయడంతో మళ్ళీ ఆక్సిజన్ సాచ్యురేషన్స్ 100 అయ్యాయి. దీంతో ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు.

   కెరీర్ విషయానికి వస్తే

  కెరీర్ విషయానికి వస్తే

  దిలీప్ కుమార్ సినీ కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ యొక్క 'ట్రాజెడీ కింగ్' గా పిలువబడే ఆయన కెరీర్ ఆరు దశాబ్దాలుగా విస్తరించింది. అతను తన కెరీర్లో 65 కి పైగా చిత్రాల్లో నటించారు. 'దేవదాస్' (1955), 'నయా దౌర్' (1957), 'మొఘల్-ఎ-అజామ్' (1960), 'గంగా జమునా' వంటి చిత్రాలలో ఐకానిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. (1961), 'క్రాంతి' (1981), మరియు 'కర్మ' (1986) లాంటి సినిమాల్లో కనిపించిన ఆయన చివరిసారిగా 1998లో 'కిలా'లో కనిపించాడు.

  అవార్డులు రివార్డులు

  అవార్డులు రివార్డులు

  మిలన్, జుగ్ను, అందాజ్, బాబుల్, నయా దౌర్, మధుమతి, కోహినూర్, మొఘల్ ఏ ఆజమ్, క్రాంతి, కర్మ, సౌదాగర్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన భారతీయ సినిమాకు సేవలందించినందుకు గాను.. 1991లో పద్మభూషణ్, 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా 1998లో నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డుతో సన్మానించింది.

   ఇక గత ఏడాది సోదరులు మృతి

  ఇక గత ఏడాది సోదరులు మృతి

  ఇటీవల దిలీప్ కుమార్ సోదరులు అషాన్, అస్లమ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గత ఏడాది వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవద్దని కూడా దిలీప్ కుమార్ - సైరాబాను జంట నిర్ణయించారు.

  Gold Medal Movie Team Exclusive Interview

  Read more about: dilip kumar bollywood
  English summary
  Actor Dilip Kumar No more: Bollywood Legendary Passed away at 98. HIs freind faisal Khan wrote that With a heavy heart and profound grief, I announce the passing away of our beloved Dilip Saab, a few minutes ago. We are from God and to Him we return
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X