పోసాని కృష్ణ మురళికి మళ్లీ కరోనా.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
నెగెటివ్ రోల్స్ తో సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి కమెడియన్ గా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పోసాని కృష్ణ మురళి. ఐలవ్యూ రాజా అంటూ తనదైన స్టైల్ లో కామెడీ చేసి అలరించిన పోసాని ఆపరేషన్ ధుర్యోదన వంటి సినిమాతో ఆలోచింపజేశారు. ప్రస్తుతం సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి ఎలా ఉందన్న వివరాల్లోకి వెళితే..
నటుడిగా దర్శకుడిగా రచయితగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఆయన ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలీం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎంపికయ్యారు. సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆయన ఈ మధ్య పలు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

అయితే తాజాగా పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ఇప్పుడు మూడోసారి కొవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో పోసాని కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. కాగా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా పోసాని కృష్ణ మురళి కొద్దిరోజుల క్రితం పుణెకు వెళ్లారు. తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతలో ఆయనకు కాస్తా జ్వరం రావడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది.

జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడటంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఈ రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పోసానికి కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు కరోనా రావండతో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాకే సినిమాల్లో బిజీ అయ్యారు.


Click it and Unblock the Notifications











