twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం.. పోలీస్ స్టేషన్‌లో నటుడు.. షాకింగ్ సంఘటన!

    |

    ఓ వైపు సోషల్ మీడియా పరిధి విస్తృతమవుతుంటే మరోవైపు ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకుంటూ సైబర్ నేరగాళ్లు పంజా విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు దండుకోవడం, సోషల్ మీడియాలో వేరొకరి పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. తమకు ఇష్టం లేని వారిపై నెగెటివ్ ప్రచారాలు చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ కూడా ఈ రకమైన మోసానికి గురై పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ అసలేం జరిగింది? వివరాలు చూస్తే..

    వైయస్ జగన్ పై దుష్ప్రచారం

    వైయస్ జగన్ పై దుష్ప్రచారం

    కొందరు ఆన్ లైన్ నేరగాళ్లు నటుడు ఫిష్ వెంకట్ పేరిట సోషల్ మీడియా ఖాతా (ట్విట్టర్ ఖాతా) ఓపెన్ చేశారు. దీని ద్వారా వరుస ట్వీట్స్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. 'మాకు మీలాగా సొంత బాబాయిని చంపడం తెలియదు. వేల కోట్ల రూపాయలు కాజేయడం అంతకంటే తెలియదు. ఈవీఎంతో సీఎం అవడం అస్సలు చేతకాదు' అంటూ పలు రకాలుగా ట్వీట్స్ చేస్తున్నారు.

     వైరల్ అయిన ట్వీట్స్.. ఫిష్ వెంకట్‌పై ఫైర్

    వైరల్ అయిన ట్వీట్స్.. ఫిష్ వెంకట్‌పై ఫైర్

    నటుడు ఫిష్ వెంకట్ పేరుతో ట్వీట్స్ రావడం, పైగా వైఎస్జగన్ పై దుష్ప్రచారం చేసేలా ఆ ట్వీట్స్ ఉండటంతో.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో జగన్ వర్గీయులు, ఆయన ఫ్యాన్స్ ఫిష్ వెంకట్‌పై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. ఇది గమనించిన ఫిష్ వెంకట్‌ పోలీసులను ఆశ్రయించాడు.

    పోలీస్ స్టేషన్‌లో నటుడు.. ఫిర్యాదులో ఇలా

    పోలీస్ స్టేషన్‌లో నటుడు.. ఫిర్యాదులో ఇలా

    తనపై వస్తున్న తప్పుడు విమర్శలను ఉద్దేశిస్తూ ఫిష్ వెంకట్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ మేరకు తన పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు నమోదు చేశాడు. తన పేరుతో జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరాడు.

    అకౌంట్ డిలీట్.. ఫిష్ వెంకట్‌ వివరణ

    ఫిష్ వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన పేరు మీద క్రియేట్ చేసిన ట్విట్టర్ ఖాతాను తొలగించేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో ఆయన ఓ వీడియో ద్వారా వివరణ ఇస్తూ సదరు వ్యక్తులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. అదే వీడియోలో వైఎస్ ఫ్యామిలీ అంటే తనకున్న గౌరవాన్ని కూడా తెలిపే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ సంఘటన ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Now a days social media creating new problems. Some of the Cyber Crimes are vary much disappointing the actor. Now Actor Fish Venkat Police Complaint Against Cyber Crime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X