తెలంగాణ ‘రోష’గాడి దిక్కుమాలిన ప్రకటన!
సినిమా వాళ్లని, రాజకీయ నాయకుల్ని ఒకే గాటన ఎందుకు కట్టేస్తూంటారో అర్థం కాని వాళ్లు ఎవరైనా వుంటే ఈ రోషగాడి సంగతి తెలీగానే సర్వం బోధపడిపోతుంది. ఇతగాడి పేరు సాకేత్. ఏదో సరదా కొద్దీ హీరో అయిపోయాడు. అయితే తన సినిమాకి ఎలాంటి ఆకర్షణలు లేవనే సంగతి అతనికీ తెలుసు ఎలాగోలా సినిమా విడుదల చేసుకోవాలి. ఏదో విధంగా జనం దష్టిలో పడాలి. కానీ తన బయోడేటాకి, రూపలావణ్యాలకీ అది అంత తేలికైన విషయం కాదని సాకేత్ కి బాగా తెలుసు.
అందుకే హోల్ ఏపీని కాకపోయినా, కనీసం తన ప్రాంతం వారినయినా ఆకట్టుకోవాలని ప్లానేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమన్న విభజన సెగలకు తనవంతు ఆయిల్ దానం చేసి చలి కాచుకోవాలని చూస్తున్నాడు. తన సినిమాకి అతనిచ్చిన ఈ పేపర్ ప్రకటన చూస్తేనే తెలీడం లేదూ. మూర్ఖత్వానికి పరాకాష్ట అని!ఈ ప్రకట చూసిన వారంతా ఈ దౌర్భాగ్యుడికి తన ముఖాన్ని ఒక్క సారి అద్దంలో చూసుకొమ్మన్ని సలహా ఇస్తున్నారట. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఏ ఏరియా జనాన్ని ఆకట్టుకోలేనని గ్రహిస్తే ఇలా పత్రికా ముఖంగా కామెడీ అయ్యే తిప్పలయినా తప్పుతాయి!


Click it and Unblock the Notifications











