భార్య గర్భవతి: పెటర్నటీ లీవులో గోపీచంద్
హైదరాబాద్: హీరో గోపీచంద్ కొంత కాలం పాటు షూటింగులకు దూరంగా ఉండబోతున్నారు. అందుకు కారణం ఆయన భార్య రేష్మ గర్భం దాల్చడమే. రేష్మకు ఇటీవలే శ్రీమంతం జరిగింది. రేష్మకు సంబంధించిన ఆరోగ్య విషయాలు, గర్భంతో ఉన్న ఆమెను మరింత సంతోషంగా ఉంచడానికి పెటర్నటీ లీవు(పితృత్వపు సెలవు) తీసుకుంటున్నట్లు గోపీచంద్ స్వయంగా వెల్లడించారు. గత కొంత కాలంగా గోపీచంద్ లౌక్యం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
హీరో గోపీచంద్ వివాహం రేష్మాతో హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో మే 12, 2013న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గోపీచంద్ పెళ్లాడిన రేష్మ ..హీరో శ్రీకాంత్ కు బంధువు.

రేష్మ గురించిన వివరాల్లోకి వెళితే... రేష్మ బీటెక్ పూర్తి చేసిందని, ఆ తర్వాత యానమినేషన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుందని తెలుస్తోంది. శ్రీకాంత్ బ్రదర్ మేక అనిల్ భాగస్వామిగా ఉన్న ఓ స్టూడియోలో ఆమె 3డి మాయా, ఇతర విజువల్ ఎఫెక్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుందట. భవిష్యత్‌లో రేష్మ 'స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ యానిమేషన్ స్టూడియో' ప్రారంభించాలనే ఆలోచనలో ఉందనే ఆలోచనలో ఉంది.


Click it and Unblock the Notifications











