ప్రేమ, కామానికి మధ్య ఫైట్.. అందుకే శ్రీరెడ్డిని కాదని శ్రీముఖిని.. హర్షవర్ధన్

By Rajababu

టాలీవుడ్ ప్రేక్షకులకు హర్షవర్ధన్ మాటల రచయితగా, కథా రచయితగా, నటుడిగా సుపరిచితులు. ప్రస్తుతం ఆయన గుడ్, బ్యాడ్, అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు అంశాలపై వివాదం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమా గురించి, పరిశ్రమలోని వివాదాలకు కారణమైన వ్యక్తుల గురించి ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌తో హర్షవర్దన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

శ్రీరెడ్డిని తీసుకోకపోవడానికి

శ్రీరెడ్డిని తీసుకోకపోవడానికి

గుడ్, అగ్లీ, బ్యాడ్ చిత్రంలో శ్రీముఖిని తీసుకోవాలనుకొన్నాను. ఎందుకంటే నా సినిమా ప్రేమ, కామానికి మధ్య జరిగే ఫైట్‌తో జరిగే కథ. ఆ సమయంలో ఆమె చాలా బిజీ అని, రెమ్యునరేషన్ ఎక్కువ అని నా స్నేహితులు చెప్పారు. అయితే శ్రీముఖితోనే ఆ పాత్ర చేయించాలని అనుకొన్నాను. ఆ తర్వాత శ్రీరెడ్డి గురించి తెలిసింది. శ్రీముఖి ఒకే చెప్పకపోతే శ్రీరెడ్డిని తీసుకోవాలని అనుకొన్నాను.

Recommended Video

రేటింగ్ పెరగడానికి నేను శ్రీముఖి ఎంతవరకయినా వెళ్తాం ! క్లారిటీ వస్తే ఇంకేముంటది ?
 శ్రీముఖిని హాట్‌గా చూపించాను

శ్రీముఖిని హాట్‌గా చూపించాను

నా చిత్రంలో శ్రీముఖి ఎక్స్‌పోజింగ్ చేయదు. కానీ నేను చాలా హాట్‌గా చూపించాలి. ఆమె చేస్తుందో చేయదో అనే సందేహం ఉండేది. కానీ ఎలాగోలా నా సినిమా కథను శ్రీముఖికి చెప్పాను. కథ నచ్చడంతో గుడ్, బ్యాడ్, అగ్లీ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నారు. ఆ విధంగా శ్రీరెడ్డితో పనిచేయలేకపోయాను.

శ్రీముఖి నటన అద్భుతం

శ్రీముఖి నటన అద్భుతం

నా స్నేహితులు భయపెట్టినట్టు శ్రీముఖి రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకొన్నది. ఇచ్చిన డేట్స్ కంటే చాలా ఎక్కువ రోజులు పనిచేసింది. ఫర్‌ఫెక్షన్ కోసం ఎన్ని టేకులంటే అన్ని టేకులు చేసింది. సినిమా చూసిన తర్వాత శ్రీముఖిని వద్దన్న వాళ్లు ఆమె నటనను బాగా మెచ్చుకొంటారు.

 క్యాస్టింగ్ కౌచ్‌పై హర్షవర్ధన్

క్యాస్టింగ్ కౌచ్‌పై హర్షవర్ధన్

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి హర్షవర్ధన్ స్పందించారు. సినీ పరిశ్రమలో ఇలాంటి సమస్య ఉందని ఎవరైనా చెబితే ఆడియెన్స్ తప్పుకుండా నమ్ముతారు. ఎందుకంటే సినిమా పరిశ్రమ గ్లామర్ ఇండస్ట్రీ. సినీతారలపై అనేక రూమర్లు ఉంటాయి. ఫలానా హీరోయిన్, యాంకర్లు రేట్ల గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కొంత మేరకు ఉంది. షార్ట్‌కట్స్ కోసం అలాంటి వాటికి కొందరు ఆకర్షితులవుతారు.

 కత్తి మహేష్‌తో వివాదం గురించి

కత్తి మహేష్‌తో వివాదం గురించి

కొంతమంది అవగాహన లేకుండా మీడియాలో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వ్యవహారమే కత్తి మహేష్, సునీత వివాదం. ఈ వివాదంలో సునీత అమాయకురాలు. బాగా తెలివి కలవాడైన కత్తి మహేష్‌పై ఆరోపణలు చేసి ఇరుక్కుపోయింది అని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X