'జింగా' తెలుగు సినిమా నటుడి అరెస్టు

అమెరికాలో, యుకెలో తనకు ఉన్న సంబంధాలతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పవన్ కుమార్ ఆయనవరానికి చెందిన ఎం మణికొండన్ అనే యువకుడి నుంచి 2009లో డబ్బులు తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన పవన్ కుమార్ అతనికి ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి.
డబ్బులు అడిగితే బెదిరించినట్లు మణికొండన్ పవన్ కుమార్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. డ్యాన్స్ మాస్టర్ కుమారుడైన పవన్ కుమార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. తమిళ సినిమా మూవరెండు ఎఝులో, తెలుగు సినిమా జింగాలో ప్రధాన పాత్రలు చేశాడు. ఈ సినిమాలు ఈ ఏడాది చివరిలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
మిత్రుల ద్వారా పరిచయమైన మణికొండన్‌ను సంప్రదించి పవన్ కుమార్ మోసం చేశాడని దర్యాప్తు అధికారులు అంటున్నారు. పవన్ కుమార్ నాలుగు కోట్ల రూపాయలకు పైగా తన సినిమాల్లో పెట్టాడని, అవి విడుదల కాగానే డబ్బులు ఇచ్చేస్తానని మణికొండన్‌కు చెప్పాడని విచారణలో తేలింది. పవన్ కుమార్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.


Click it and Unblock the Notifications











