twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుళ్లు వాళ్లే.. లెజెండ్ మూడేళ్లు ఆడింది.. నంది అవార్డుపై జగపతిబాబు కామెంట్

    రక్తదానం చేయడంపై అందరూ దృష్టిపెట్టాలి అని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. రోగులకు, ప్రమాదానికి గురైన వారు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో చనిపోయారు అని చాలా సార్లు విన్నాను. అందుకే ఎన్టీఆర్, బసవతారక క్

    By Rajababu
    |

    రక్తదానం చేయడంపై అందరూ దృష్టిపెట్టాలి అని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. రోగులకు, ప్రమాదానికి గురైన వారు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో చనిపోయారు అని చాలా సార్లు విన్నాను. అందుకే ఎన్టీఆర్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న అనంతరం జగపతిబాబు మీడియాతో మాట్లాడారు.

     ఆపదలో ఆదుకొనే వాడే దేవుడు

    ఆపదలో ఆదుకొనే వాడే దేవుడు

    దేవుడు ఎక్కడ ఉన్నారు అని అందరూ అని అడుగుతుంటారు. నన్నడిగితే సరైన సమయంలో ఆపదలో ఉన్నవారికి రక్తం అందించే వ్యక్తి, దానం చేసే వ్యక్తి దేవుడు అని నేను నమ్ముతాను అని జగపతి అన్నారు.

    రక్తదానం చేయ్యాలి..

    రక్తదానం చేయ్యాలి..

    ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సమాజ సేవ కోసం ఆలోచించి రక్తదానం అందిస్తే సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టే దేవుడి అవుతాం అని జగపతి బాబు చెప్పారు.

    మంచి చెడు మీరే చెప్పాలి

    మంచి చెడు మీరే చెప్పాలి

    లెజెండ్ విలన్ పాత్ర పోషించాను. ఇప్పుడు నేను రక్తదానం చేస్తున్నాను. నేను మంచివాడినా లేదా చెడ్డవాడినా అనేది మీరే చెప్పాలి. రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చి బ్లడ్ డొనేట్ చేశాను. అందరూ చేయాల్సిన అవసరం ఉంది.

    నా తొలి చిత్రం మూడురోజులే

    నా తొలి చిత్రం మూడురోజులే

    నా మొదటి సినిమా సింహస్వప్పం. ఆ సినిమా మూడు రోజులు ఆడింది. నేను విలన్‌గా చేసిన చిత్రం లెజెండ్ మూడు సంవత్సరాలు ఆడింది. విలన్ ఆ చిత్రంలో చేసిన పాత్రకు నాకు నంది అవార్డు లభించింది. ఆ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది.

     నంది అవార్డులపై నో కామెంట్

    నంది అవార్డులపై నో కామెంట్

    నంది అవార్డులు వివాదంగా మారడంపై నేను కామెంట్ చేయబోను. అది మీడియా, జ్యూరీకి సంబంధించిన విషయం. దానిపై మీరే తేల్చుకోవాలి అని జగపతిబాబు చమత్కరించారు.

    English summary
    Actor Jagapathi Babu is not willing to comment on Nandi Awards which recently announced. He said Nandi Awards given for him who played Villain Role in Legend. First time Jagapathi babu played villain role in Legend. In this occassion, Jagapthibabu said that As hero my first film Simhaswapnam run only for three days. But As Villain, Legend exhibited for Three years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X