twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!

    |

    ప్రముఖ సినీ నటి జమున ఇక లేరు. వృద్యాప్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం అంటే.. జనవరి 27వ తేదీన కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో వివిధ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఆమె మరణంతో సినీ పరిశ్రమ కన్నుమూసింది. జమున ఇక లేరనే వార్త సినీ అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర దిగ్బాంత్రికి గురిచేసింది. ఆమె మృతికి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలియజేస్తున్నారు. జమున వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం

    జమున జననం, వ్యక్తిగత జీవితం

    జమున జననం, వ్యక్తిగత జీవితం

    జమున 1936లో కర్ణాటకలోని హంపీలో నిప్పాని శ్రీనివాస రావు, కౌసల్యా దేవీ దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు జానా భాయి. పసుపు, పొగాకు వ్యాపారాన్ని చేసే జమున తండ్రి దుగ్గిరాలకు షిప్ట్ అయ్యారు. దాంతో ఆమె బాల్యం దుగ్గిరాలలోనే గడిచింది. సినిమా అవకాశాల కోసం చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ తరలిరావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

    సావిత్రి కారణంగా సినిమాల్లో

    సావిత్రి కారణంగా సినిమాల్లో

    జమున సినీ రంగ ప్రవేశం విచిత్రంగా జరిగింది. చిన్నతనం నుంచే నాటకాల్లో నటిస్తున్న జమునను సావిత్రి గమనించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినప్పుడు జమున ఇంట్లోనే సావిత్రి ఉన్నారు. సినిమాలపై ఆసక్తిని గమనించిన సావిత్రి.. జమున సినీ రంగంలోకి ఆహ్వానించారు. దాంతో 15 ఏళ్ల వయసులోనే ఆమె సినీ రంగంలోకి ప్రవేశించారు.

    200 చిత్రాల్లో నటించిన జమున

    200 చిత్రాల్లో నటించిన జమున

    జమున చిన్నతనంలో డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటన పరంగా శిష్యరికం చేశారు. తల్లి నుంచి సంగీతం నేర్చుకొన్నారు. మాభూమి నాటకంలో ఆమె ప్రదర్శనను చూసి పుట్టిల్లు అనే చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. దాంతో ఆమె సినీ ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో దాదాపు 200కిపైగా చిత్రాల్లో నటించారు.

     ప్రొఫెసర్ రమణారావుతో పెళ్లి

    ప్రొఫెసర్ రమణారావుతో పెళ్లి

    జమున నటిగా పాపులర్‌గా ఉన్న సమయంలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును 1965లో వివాహం చేసుకొన్నారు. జమునకు కుమారుడు వంశీ, కూతురు స్రవంతి ఉన్నారు. భర్త రమణారావు 2014లో గుండెపోటుతో మరణించారు.

    జమున నటించిన కొన్ని పాపులర్ చిత్రాలు

    జమున నటించిన కొన్ని పాపులర్ చిత్రాలు

    పుట్టిల్లుతో కెరీర్ ప్రారంభించిన జమున.. ఆ తర్వాత నిరుపేదలు, వద్దంటే డబ్బు. దొంగ రాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతి అనసూయ, ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు. మూగ మనుషులు, రాముడు భీముడు, దొరికితే దొంగలు. ఆమె నటించిన చివరి చిత్రం బాహుబలి.

    English summary
    Popular Telugu actor Jamuna no more. She died at the age of 69 years. Telugu film Industry has condolanced to popular actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X