ఆయన్ను చెంపదెబ్బ కొట్టే సీన్.. స్టార్ హీరో ప్రాజెక్ట్ వదిలేయడంపై నటుడు జయరామ్ కామెంట్స్

ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం రావడం, మంచి పాత్ర దొరకడం కూడా శాపంగా మారుతుంది. ఎందుకంటే ఆ ప్రాత స్వభావాన్ని బట్టి స్టార్స్‌పై చేయిజేసుకోవాల్సి వస్తుంది. అది పాత్రకు అనుగుణంగానే అయినా.. తమ హీరోపై చేయి వేస్తే అభిమానులు ఊరుకోరు. ఇదే సమస్యతో ఓ అద్భుతమైన చిత్రంలో అవకాశాన్ని చేజార్చుకున్నానని మలయాళం నటుడు జయరామ్ చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

తెలుగు నాట ఫేమస్..

తెలుగు నాట ఫేమస్..

పక్క రాష్ట్ర ఇండస్ట్రీలకు చెందిన నటులు తెలుగు నాట బాగానే ఫేమస్ అవుతుంటారు. ఆ మధ్య బొమన్ ఇరానీ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మలయాళి నటుడు జయరామ్ కూడా తెలుగు నాట బాగానే పాపులర్ అయ్యాడు. భాగమతిలో విలన్, అల వైకుంఠపురములో తండ్రి పాత్రలో కనిపించి అందరికీ దగ్గరయ్యాడు.

క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం..

క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం..

జయరామ్‌కు మరో క్రేజీ ఆఫర్ దక్కింది. క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోతోన్న చిత్రంలో ఓ మంచి రోల్ దక్కిందట. అయితే ఈ చిత్రం 18వ శతాబ్దానికి చెందినదని, షూటింగ్ కోసం భారీ సెట్స్, భారీ తారాగణం అవసరం ఉందని, ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ జరపడం కష్టమని చెప్పుకొచ్చాడు.

ఆ ప్రాజెక్ట్‌‌ను వదిలేశా..

ఆ ప్రాజెక్ట్‌‌ను వదిలేశా..


1995లో తమిళ, తెలుగు భాషల్లో ముత్తు సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఓ మలయాళి చిత్రం ఆధారంగా తెరకెక్కించారట. అయితే ఈ మూవీలో శరత్ బాబు పాత్ర కోసం ముందుగా జయరామ్‌ను సంప్రదించారట.

Recommended Video

Kannada Actor Chiranjeevi Sarja గుండెపోటుతో మృతి
చెంపదెబ్బ కొట్టే సీన్..

చెంపదెబ్బ కొట్టే సీన్..


రజినీకాంత్‌తో కలిసి నటించాలని తాను కూడా ఎంతో ఆశపడ్డానని, అయితే ఈ చిత్రంలో ఆయన్ను చెంపదెబ్బ కొట్టే సీన్ ఉందని అందుకే వదిలేశానని తెలిపాడు. ఆయన్ను అలా కొడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనే ఉద్దేశ్యంతో తాను ఆ ప్రాజెక్ట్‌ను వదిలేశానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X