జేడీ చక్రవర్తిని చంపేందుకు కుట్ర.. ఏడాది పాటు విష ప్రయోగం.. ఎలా బయట పడ్డాడంటే?

జేడీ చక్రవర్తి గురింతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ప్రతినాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత హీరోగా, నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన జేడీ చక్రవర్తికి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రస్తుతం కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఆయన దయ అనే వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తనపై జరిగిన విష ప్రయోగం గురించి షాకింగ్ విషయాలు తెలిపారు.

హత్య కుట్రపై:రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి హీరోగా మనీ మనీ, అనగనగా ఒకరోజు, గులాబి, దెయ్యం, బొంబాయి ప్రియుడు, మృగం, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయేరా వంటి మంచి హిట్ చిత్రాలతో అలరించారు. హోమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, ఆల్ ది బెస్ట్ సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. అయితే తాజాగా ఆయనపై చేసిన హత్య కుట్ర ఏంటనేది తెలిపారు.

Actor JD Chakravarthy Reveals About Slow Poison On Him In Latest Interview

బ్రీతింగ్ సమస్య:"ఈ ఇన్సిడెంట్ గురించి అడిగితే ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే విష ప్రయోగం చేసింది చాలా దగ్గరి వ్యక్తి. జెండర్ ఏంటీ, పిల్లలా, పెద్దవారా, రిలేషన్ ఏంటీ అనే విషయాలు అడగొద్దు.

ఉన్నట్టుండి నాకు బ్రీతింగ్ సమస్య వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. పైగా నాకు సిగరెట్స్, డ్రగ్స్, మందు లాంటి అలవాట్లేం లేవు. ఊపిరి తీసుకోలేనంత స్థాయికి వెళ్లిపోయా. అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉత్తేజ్ శ్రీనివాసన్ అనే డాక్టర్ ను పంపిచారు. అలాగే ఇండియా, శ్రీలంక చాలా మంది డాక్టర్లను సంప్రదించా. కానీ ఎవరు కూడా సమస్యేంటో కనిపెట్టలేకపోయారు" అని అన్నారు అని చక్రవర్తి పేర్కొన్నారు.

Actor JD Chakravarthy Reveals About Slow Poison On Him In Latest Interview

సంవత్సరం పాటు:"చివరకు డాక్టర్స్ సైతం కష్టమన్నారు. అప్పుడే మరో క్లోజ్ ఫ్రెండ్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నిర్మాత శేషు డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కొన్ని టెస్టులు చేసిన తర్వాత నీ లైఫ్ లో ఏదైనా సమస్య ఉందా. ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావ్ అని అడిగారు. నేను సిగరెట్ కూడా కాల్చను. అలాంటిది డ్రగ్స్ తీసుకోవడమేంటని ఆశ్చర్యపోయాను. ఆయన చేసిన టెస్టుల్లో 8 నెలలు లేదా ఏడాదిగా నేను స్లో పాయిజన్ తీసుకుంటున్నట్లు తేలింది" అని జేడీ చక్రవర్తి ఉన్న విషయం తెలిపారు.

Actor JD Chakravarthy Reveals About Slow Poison On Him In Latest Interview

అతనితో గొడవ:"నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో నాకు ఒకరు ఖాసీమ్ అనే ఫ్రెండ్ ప్రతిరోజు నాతోనే ఉండేవాడు. వాడు నేను తాగే కషాయాన్ని చూసి డైలీ నువ్వు ఒక్కడివే తాగుతావా. నేను కూడా తాగుతానంటే ఇచ్చాను. ఆ తర్వాత రెండు రోజులకు తనకు జ్వరం వచ్చింది. ఆ కషాయాన్ని నాతో తాగిస్తున్న వ్యక్తికి ఖాసీమ్ కు జరగింది చెప్పాను. నీకోసం ప్రత్యేకంగా చేయించిన కషయాన్ని అతనికి ఎందుకు ఇచ్చావని గొడవ చేశాడు. ఆ విషయం అక్కడే వదిలేశాను. కట్ చేస్తే అదే కషాయంలో స్లో పాయిజన్ కలిపారని తెలిసింది" అని జేడీ చెప్పుకొచ్చారు.

Actor JD Chakravarthy Reveals About Slow Poison On Him In Latest Interview

బ్యాడ్ అలవాట్లు ఉండాలి:"ఆ కషాయం తాగుతున్న సమయంలోనే ఒకరోజు అస్సలు ఊపిరి ఆడలేదు. మా అమ్మ తను వాడే ఇన్ హేలర్ ఇచ్చింది. దాంతో నాకు రిలీఫ్ దొరికింది. అదే విషయం డాక్టర్ కు చెబితే ఆ కషాయం రూపంలో ఇచ్చిన స్లో పాయిజన్ ఏంటో తెలిసింది. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా దొరకదు. నా ఫ్రెండ్ ఖాసీమ్ కు ఇతర అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఆ పాయిజన్ ను అతని శరీరం తీసుకోలేకపోయింది. అందుకే బ్యాడ్ అలవాట్లు ఉండటం కూడా మంచిదే అని అప్పుడే తెలిసింది" అని జేడీ చక్రవర్తి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X