»   » రాళ్ల దాడి: కంటి చూపు కోల్పోయే స్థితిలో ప్రముఖ నటుడు!

రాళ్ల దాడి: కంటి చూపు కోల్పోయే స్థితిలో ప్రముఖ నటుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాడీగార్డ్, సోల్జర్ లాంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు జీతూ వర్మపై దాడి జరిగింది. ఇటీవల జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మౌంట్ అబూ నుంచి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు వెలుతూ చిత్తోడ్‌గఢ్ అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జీతూ వర్మపై దాడి చేసారు.

ఈ దాడిలో జీతూ వర్మ కంటి చూపు కోల్పోయే స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో దాడి జరిగడంతో దాడికి ఎవరు పాల్పడ్డారనేది తెలియడం లేదు. దారి దోపిడీ ముఠాలే రాత్రి వేళలో ఇలాంటివి చేస్తుంటారని ఆ ప్రాంతం వారు అంటున్నారు.

ప్రమాదకరమైన అటవీ ప్రాంతం

ప్రమాదకరమైన అటవీ ప్రాంతం

చిత్తోడ్‌గఢ్ అటవీ ప్రాంతం దాదాపు 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రయాణ సమయంలో జీతూ డ్రైవర్ పక్కన ముందు సీట్లోనే కూర్చున్నాడు. ఉన్నట్టుండి కారుపై రాళ్లు పడటం మొదలవ్వడంతో ప్రమాదాన్ని ఊహించిన డ్రైవర్ ఆపకుండా వేగంగా కారును ముందుకు నడిపించాడు.

కంటికి తీవ్రగాయం

కంటికి తీవ్రగాయం

దాదాపు కిలో మీటర్ మేర రాళ్ల దాడి జరిగింది. అందులో ఓ రాయి కారు అద్దాన్ని చీల్చు కుంటూ జీతూ వర్మ కంటికి బలంగా తగిలి తీవ్ర గాయం అయింది. సమీపంలోని టోల్ బూత్ దగ్గర కారును ఆపి పోలీసులకు సమాచారం అందించారు.

గతంలో సంజయ్ లీలా భన్సాలీపై దాడి

గతంలో సంజయ్ లీలా భన్సాలీపై దాడి

గతంలో ఇదే ప్రాంతంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపైనా దాడి జరిగింది. ఇపుడు జీతూ వర్మపై కూడా దాడి జరుగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆ ప్రాంతంలో గస్తీ పెంచారు.

కంటిచూపు పోయే స్థితిలో జీతూ

కంటిచూపు పోయే స్థితిలో జీతూ

జీతూ కంటికి ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. కనుబొమ్మ చిట్లి అక్కడ ఎముక ఫ్రాక్చర్ అయిందని, కనుబొమ్మకు పది కుట్లు పడ్డాయి. గాయం వల్ల కంటిలో రెటీనా పనిచేయట్లేదని, కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు

English summary
There's some disturbing news coming our way. Bollywood actor Jeetu Verma who has done side roles in popular films like Bodyguard, Soldier and others was attacked in Chittorgarh. When Jeetu was travelling from Mount Abu to Jaipur, a group of local men started pelting stones at his car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu