టీచర్‌ను పెళ్లాడిన ప్రముఖ విలన్.. అలాంటి అమ్మాయిని చేసుకోవాలనే కోరికతో వివాహం
సినీ సెలబ్రిటీలు అయినా.. సాధారణ వ్యక్తులైన వివాహం, కాబోయే భార్య లేదా భర్తపై అనేక ఊహలతో ఆశలు పెంచుకుంటారు. మనం పెళ్లి చేసుకునే వారు కచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఒక గిరిగీసుకుని ఉంటారు. తమకు నచ్చిన అంశాలు ఉన్న వారు జీవిత భాగస్వామి అయితే వారి ఆనందానికి అవధులు ఉండవు.
ఇప్పుడు అలాంటి సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ ప్రముఖ విలన్ కబీర్ దుహన్ సింగ్. ఎలాంటి యువతిని అయితే వివాహం చేసుకోవాలనుకున్నాడో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు. అసలు అతను కోరుకున్నది ఏంటీ అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమాతో: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతినాయకుడిగా మెప్పించారు. అలాంటి వారిలో కబీర్ దుహన్ సింగ్ ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే విలన్ గా కెరీర్ ప్రారంభించిన కబీర్ అనేక సినిమాల్లో స్టార్ హీరోలకు ధీటైన ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. మ్యాచో హీరో గోపీచంద్ స్టైలిష్ మూవీ జిల్ సినిమాలో విలన్ గా పరిచయం అయ్యాడు హిందీ యాక్టర్ కబీర్ దుహన్ సింగ్.

ప్రతినాయకుడిగా: 2015లో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాతో విలన్ గా అడుగు పెట్టి కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కబీర్ సింగ్. దీని తర్వాత అజిత్ వేదాళం (భోళా శంకర్ అఫిషియల్ రీమేక్ మూవీ) సినిమాతో తమిళం సినీ ఇండస్ట్రీలోను అడుగు పెట్టాడు కబీర్ దుహన్ సింగ్. ఇందులో ప్రతినాయకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు కబీర్.

తెలుగు చిత్రాలు: అనంతరం తెలుగులోనే కిక్ 2, డిక్టేటర్, స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీమ్, జక్కన్న, పటేల్ సర్, సాక్ష్యం, హంట్ వంటి ఇతర సినిమాల్లో విలన్ గా మంచి నటన కనబర్చాడు. ఇక ఇటీవలే సమంత శాకుంతలం, ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కబ్జాలోనూ కబీర్ సింగ్ నటించాడు.

ఫొటోలు వైరల్: ఫకాట్ అనే మరాఠి చిత్రంలో చివరిగా కనిపించిన కబీర్ దుహన్ సింగ్ తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. మ్యాథ్స్ టీచర్ అయిన సీమ చాహల్ ను కబీర్ సింగ్ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జూన్ 25న అంటే ఇవాళ ఢిల్లీలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి.
హర్యానా రాష్ట్రం: కబీర్ సింగ్ లేత గోధు రంగు షేర్వాణి ధరించగా.. పెళ్లి కుమార్తె ఎరుపు రంగు లెహంగా, కుందన్ ఆభరణాల్లో మెరిసిపోయారు. ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో కబీర్, సీమ చాహలన్ పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఇక ఇవాళ కబీర్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్ కాగా సీమ చాహల్ అదే రాష్ట్రానికి చెందినది.

కోరుకున్నట్లుగానే: కబీర్ దుహన్ సింగ్ ది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తనను, తన కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇన్నాళ్లు కబీర్ సింగ్ ఎదురు చూశాడట. అంతేకాకుండా, సినిమా ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట అమ్మాయిని చేసుకోవాలని కోరుకున్నాడట. అతని కోరిక మేరకు మంచి అమ్మాయి భార్యగా దొరికిందని, ఈ విషయంలో కబీర్ దుహన్ సింగ్ ఎంతో సంతోషంగా ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











