twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్‌గా మారుతా.. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నా.. కల్యాణి ప్రియదర్శన్

    |

    యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కల్యాణి చెప్పారు. ఆమె ఏమన్నారంటే..

    నాకు యాక్టర్‌గా మారాలనే ఆలోచన లేదు. డైరెక్టర్‌ కావాలన్నది నా కోరిక. కానీ హలో ఆఫర్ రావడం, ప్రతిష్టాత్మకమైన బ్యానర్ కావడంతో నేను ఒప్పుకోవాల్సింది. మా అమ్మ (సీనియర్ నటి లిజి) కూడా నన్ను ఎంకరేజ్ చేసింది. నాకు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలైంది. తమిళం లేదా మలయాళం సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురుచూస్తుంటే తెలుగు ఆఫర్ రావడం సంతోషం కలిగింది. మా అమ్మ కూడా టాలీవుడ్ మంచి ఇండస్ట్రీ. అక్కడి వారంతా మంచి వారు అని చెప్పారు.

    Actor Kalyani Priyadarshan about her career

    తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు రాలేదు. త్వరలోనే నేను పూర్తిగా నేర్చుకొని తెలుగులోనే మాట్లాడుతాను. ఏదో ఒకరోజు నేను డైరెక్టర్ కావడం తథ్యం. అది ఏ రోజనది నాకు తెలియదు. ఏదో ఒకరోజు మైక్రోఫోన్ పట్టుకొంటాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. నా పాత్ర నిడివి ఏ మేరకు ఉంటుంది? నా పాత్రకు ప్రధాన్యత ఉంటుందా? అనే విషయాలు పట్టించుకోను. స్క్రిప్టులో ఎంత ఇంటెన్సిటి ఉంటుంది? నాకు ఏ మేరకు గుర్తింపు వస్తుందని ఆలోచిస్తాను అని కల్యాణి ప్రియదర్శన్ చెప్పారు.

    నా ఆలోచనల్లో కొన్ని కథలు ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను. సమయం చిక్కితే వాటికి అక్షరరూపం ఇస్తాను. కథలన్నీ కేవలం పాయింట్ల రూపంలో ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తాను. డైరెక్టర్ మారే ఆలోచన ఉన్నప్పుడు వాటి గురించి స్పష్టంగా ఆలోచిస్తాను అని అన్నారు.

    English summary
    Sithara Entertainments., the producers of the film decided to go for 15th August, release. In this occassion, Heroine Kalyani Priyadarshini speak to filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X