twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ద్రౌపదిని జూదంలో పావులా.. కమల్‌హాసన్ నోటిదురుసు, దిష్టిబొమ్మ దగ్ధం!

    మహాభారతంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి.

    By Rajababu
    |

    మహాభారతంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. ఇటీవల కమల్ తమిళ చానెల్‌తో మాట్లాడుతూ 'మహాకావ్యంగా భావించే మహాభారత గ్రంథంలో ఓ మహిళ అన్యాయానికి గురైంది. ద్రౌపదిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా భారత్‌లో మహాభారతాన్ని ఇంకా గౌరవిస్తున్నారు' అని వ్యాఖ్యానించాడు.

    కమల్‌పై హిందూసంస్థల మండిపాటు

    కమల్‌పై హిందూసంస్థల మండిపాటు

    కమల్ వ్యాఖ్యలపై తమిళనాడులోని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కమల్‌పై హిందూ మక్కల్ కచ్చి (హెచ్ఎంకే) బుధవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. హెచ్ఎంకే రాష్ట్ర కార్యదర్శి రమా రవికుమార్ దీనిపై స్పందించారు. హిందూ వ్యతిరేకి అయిన కమల్ హాసన్ వ్యాఖ్యలు హిందువులను తీవ్రంగా భాధించాయని అన్నారు.

    కమల్ తీరు సరికాదు..

    కమల్ తీరు సరికాదు..

    ‘మహాభారతంపై కమల్‌హాసన్ అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇది తగదు. ఇదే విధంగా ఖురాన్, బైబిల్ గురించి వ్యాఖ్యలు చేయగలరా? ఇతర మతంపై వ్యాఖ్యలు చేసే దమ్ము కమల్‌కు లేదు. విశ్వరూపం విడుదలకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడారు. ముస్లింలను చెడుగా చూపించారంటూ సినిమా విడుదలపై పోరాటం చేశారు అని రవికుమార్ అన్నారు. ఆ సమయంలో ఈ రాష్ట్రంలో భద్రత కరువైంది. వేరే ఎక్కడికైనా వెళ్లి బతుకుతాను కమల్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

     ఇతర మతాలపై మాట్లాడుతాడా?

    ఇతర మతాలపై మాట్లాడుతాడా?

    ఇతర మతం గురించి మాట్లేడే దమ్ము ఆయనకు లేదు. కమల్ హిందూ వ్యతిరేకి. మహా భారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. గతంలో కూడా హిందువులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఓపికపట్టాం. ఇక, చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అని రవికుమార్ చెప్పారు.

     చెన్నై, ఈరోడ్‌లో నిరసనలు

    చెన్నై, ఈరోడ్‌లో నిరసనలు

    కమల్ వ్యాఖ్యలపై మండిపడుతూ చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. హెచ్ఎంకే సంస్థ ఒక్కటే కాకుండా అఖిల హిందూ మహాసభ కూడా కోయంబత్తూర్‌లో కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈరోడ్‌లో కమల్ ఫొటోలను దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్‌కు తరలించారు.

    English summary
    Kamal Haasan is in trouble yet again for his comments. In a recent interview with a Tamil channel, Kamal Haasan had made a derogatory comment on Mahabharata. He said Panchali was used as a pawn while the men gambled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X